నందమూరి బాలకృష్ణ( Nandamuri Balakrishna ) హీరోగానే కాకుండా హోస్ట్ గా కూడా అన్ స్టాపబుల్ షో( unstoppable show ) తో సత్తా చాటుతున్నాడు.ఇప్పటికే ఆహా లో రెండు సీజన్ లు అన్ స్టాపబుల్ షో స్ట్రీమింగ్ అయింది.
కాస్త ఆలస్యంగా మూడవ సీజన్ ను మొదలు పెట్టబోతున్నారు.ముందుగా అనుకున్న ప్రకారం ఈ సీజన్ ను ఇప్పటికే ప్రారంభించాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల వాయిదా వేస్తూ వచ్చారు.
ఎట్టకేలకు దసరా నుంచి అన్ స్టాపబుల్ సీజన్ 3 ని మొదలు పెట్టబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.ఇప్పటికే బాలయ్య తో ఆహా వారు ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఇక బాలయ్య కు అనుకూలం అయిన వారిని గెస్ట్ లుగా తీసుకు రాబోతున్నారు అంటూ కూడా సమాచారం అందుతోంది.మొత్తానికి బాలయ్య మరియు ఆహా వారి యొక్క ఒప్పందం గురించి రకరకాలుగా ప్రచారం జరుగుతోంది.
ఆ విషయం పక్కన పెడితే అన్ స్టాపబుల్ స్టేజ్ పై నందమూరి యంగ్ స్టార్ మోక్షజ్ఞ( mokshagna ) సందడి చేసే అవకాశాలు ఉన్నాయి.

బాలయ్య తాజా చిత్రం భగవంత్ కేసరి ( Bhagwant Kesari )యొక్క ప్రమోషన్ లో భాగంగా అన్ స్టాపబుల్ సీజన్ 3 యొక్క మొదటి ఎపిసోడ్ ను రెడీ చేస్తున్నారు.దర్శకుడు అనిల్ రావిపూడి, హీరోయిన్స్ కాజల్ అగర్వాల్, శ్రీలీల మరియు నిర్మాత పాల్గొనే అవకాశాలు ఉన్నాయి.మరో వైపు చిత్ర యూనిట్ సభ్యులతో పాటు మోక్షజ్ఞ కూడా ఈ షో లో హాజరు అయ్యే విధంగా ప్లాన్ చేస్తున్నారట.
ప్రస్తుతం షూటింగ్ కి ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఒకే రోజు లో ఆ ఎపిసోడ్ యొక్క చిత్రీకరణ ముగించే విధంగా డైరెక్షన్ టీమ్ ప్లాన్ చేస్తున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.
మొత్తానికి అన్ స్టాపబుల్ షో లో మోక్షజ్ఞ రావడం గురించి ఆసక్తికరంగా చర్చ జరుగుతోంది.ఒక వేళ ఆహా షో లో మోక్షజ్ఞ కనుక వస్తే కచ్చితంగా ఎంట్రీ ఎప్పుడు అనే విషయమై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది అంటూ నందమూరి బాలయ్య అభిమానులు చాలా నమ్మకంగా చెబుతున్నారు.








