మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ) హీరో గా శంకర్ దర్శకత్వం లో దిల్ రాజు నిర్మిస్తున్న గేమ్ ఛేంజర్( Game Changer ) విషయం లో ఉన్న గందరగోళం కు స్వస్థి చెప్పేందుకు రెడీ అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది.సినిమా ను సంక్రాంతికి తీసుకు వస్తారా లేదా అనే అనుమానం ఉంది.
దర్శకుడు శంకర్( Shankar ) ఎక్కువగా ఇండియన్ 2 సినిమా పై దృష్టి పెట్టాడు అంటూ వార్తలు వస్తున్నాయి.కనుక గేమ్ ఛేంజర్ ను ఆయన లైట్ తీసుకుంటున్నాడు.
ఆయన లైట్ తీసుకోవడం వల్లే ఆలస్యం అవుతుంది అని వాదించే వారు ఎక్కువగా ఉన్నారు.ఇలాంటి సమయంలో దసరా సందర్భంగా సినిమా నుంచి పాటను విడుదల చేయడం వల్ల సంక్రాంతికి సినిమా ఉంటుంది అనే నమ్మకం ను ఫ్యాన్స్ మరియు ప్రేక్షకుల్లో కలిగించవచ్చు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియాలో గేమ్ ఛేంజర్ సినిమా యొక్క మొదటి పాటను సంగీత దర్శకుడు థమన్( Thaman ) ఎప్పుడో ట్యూన్ చేశాడట.ప్రస్తుతం ఆ పాటకు సంబంధించిన వీడియో కోసం షూటింగ్ చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి.హీరోయిన్ కియారా అద్వానీ( Kiara Advani ) కూడా షూటింగ్ లో పాల్గొంటుంది.మొత్తానికి దసరా కి సినిమా యొక్క మొదటి పాట రాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందని మెగా ఫ్యాన్స్ అప్పుడే సంబరాలు మొదలు పెట్టారు.

కానీ యూనిట్ సభ్యుల నుండి ఇప్పటి వరకు అధికారికంగా క్లారిటీ రాలేదు.ప్రస్తుతానికి సినిమా యూనిట్ సభ్యు లు సైలెంట్ గా తమ పని తాము చేసుకుంటూ వెళ్తున్నారు.ముందు ముందు కచ్చితంగా గేమ్ ఛేంజర్ సినిమా ను ఓ రేంజ్ లో ప్రమోట్ చేసే విధంగా మొదటి పాట ఉపయోగపడుతుందని అంతా భావిస్తున్నారు.అదే నిజం అయితే కచ్చితంగా గేమ్ ఛేంజర్ మొదటి పాట ప్రేక్షకులకు దసరా పండుగను డబుల్ చేస్తుందని అంతా భావిస్తున్నారు.







