దసరా పండుగ రావడంతో ప్రతి ఒక్క హీరో కూడా తాము నటించిన సినిమాలను దసరా పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు.ఈ క్రమంలోని కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి విజయ్ నటించిన లియో (Leo) సినిమా అక్టోబర్ 19వ తేదీ విడుదల కానుంది అదేరోజే నందమూరి నటసింహం బాలకృష్ణ(Balakrishna ) నటించిన భగవంత్ కేసరి (Bhagavanth Kesari) సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.
ఇక అక్టోబర్ 20వ తేదీ మాస్ మహరాజ రవితేజ (Ravi Teja) నటించిన టైగర్ నాగేశ్వరరావు(Tiger Nageswararao) సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.మరి ఈ పోటీలో ఎవరు సక్సెస్ అవుతారు అనే విషయం గురించి ఆత్రుత నెలకొంది.

ఇక టాలీవుడ్ ఇండస్ట్రీ విషయానికి వస్తే బాలకృష్ణ రవితేజ సినిమాల మధ్య పోటీ ఏర్పడబోతుందని తెలుస్తుంది.అయితే వీరిద్దరి మధ్య పోటీ ఏర్పడటం ఇది మొదటిసారి కాదు ఇదివరకే ఈ హీరోలు ఇద్దరు నటించిన సినిమాలు ఒకేసారి బాక్స్ ఆఫీస్ వద్ద పోటీపడ్డాయి అయితే మూడుసార్లు కూడా బాలకృష్ణ సినిమాలు పరాజయం పాలయ్యి రవితేజ సినిమాలో సక్సెస్ అందుకోవటం విశేషం అయితే నాలుగో సారి కూడా ఈ ఇద్దరు హీరోలు బాక్స్ ఆఫీస్ వద్ద నువ్వా నేనా అంటూ పోటీకి సై అంటున్నారు.మరి ఈ పోటీలో ఎవరు సక్సెస్ అందుకుంటారు లేదు అనే విషయం తెలియాల్సి ఉంది.

ఇక 2008 సంక్రాంతికి బాలకృష్ణ ఒక్కమగాడు,( Okkamagadu ) రవితేజ కృష్ణ( Krishna ) సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి అయితే రవితేజ కృష్ణ సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది.ఆ తర్వాత 2009లో రవితేజ కిక్, బాలకృష్ణ మిత్రుడు సినిమాలు వారం గ్యాప్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి ఇక కిక్ సినిమా( Kick Movie ) ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే.ఇక ముచ్చటగా మూడోసారి 2011లో రవితేజ మిరపకాయ్, బాలకృష్ణ పరమవీరచక్ర సినిమాలు ముందుకు రాగా ఈసారి కూడా రవితేజనే సక్సెస్ కొట్టారు.
మరి నాలుగో సారి కూడా వీరిద్దరూ పోటీకి సై అంటున్నారు.మరి ఈ సారి ఎవరు సక్సెస్ అందుకుంటారో తెలియాల్సి ఉంది.







