సాధారణంగా సినిమా సెలబ్రిటీలపై ప్రతి ఒక్కరు ఎంతో ఫోకస్ చేసి ఉంటారు.ఇక సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత సెలబ్రిటీలు ఏ విషయం గురించి మాట్లాడిన వాటికి మరొక అర్థాలను తీస్తూ సోషల్ మీడియాలో వారిని ట్రోల్ చేయడం జరుగుతుంది అయితే తాజాగా అనసూయ( Anasuya ) పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )విషయంలో ప్రస్తుతం భారీగానే ట్రోల్స్ ఎదుర్కొంటున్నారని చెప్పాలి.
అసలు అనసూయ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం ఏంటి పవన్ అభిమానులు తనని ట్రోల్ చేయడం ఏంటి అనే విషయానికి వస్తే ప్రస్తుతం అనసూయ వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.తాజాగా ఈమె రాజాకర్ సినిమా నుంచి భారతీ భారతీ ఉయ్యాలో అనే పాటను విడుదల చేయడంతో ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇలా ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా తాను రాజకీయాలలోకి రానని సేవ చేయాలి అంటే రాజకీయాలలోకి రావాల్సిన అవసరం లేదు అంటూ తన అభిప్రాయాన్ని తెలియజేశారు.ఇలా అనసూయ చేసినటువంటి ఈ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ అభిమానులు ఈమెను ట్రోల్ చేస్తున్నారు.ఈ వ్యాఖ్యలను పరోక్షంగా పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి మాట్లాడారని అనసూయ పై పవన్ కళ్యాణ్ అభిమానులు ట్రోల్ చేస్తున్నారు.పవన్ కళ్యాణ్ పలు సందర్భాలలో తాను ప్రజాసేవ చేయడం కోసమే రాజకీయాలలోకి వచ్చానని చెప్పిన సంఘటనలు మనకు తెలిసిందే.

ఇక అనసూయ కూడా ప్రజలకు సేవ చేయాలి అంటే రాజకీయాలలోకి రావాల్సిన అవసరం లేదని మనకున్న దాంట్లో సహాయం చేస్తే సరిపోతుంది అంటూ చెప్పారు.అయితే ఈమె పరోక్షంగా పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టుకొని ఇలాంటి కామెంట్స్ చేశారు అంటూ పవన్ అభిమానులు ఈమెపై ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు.అయితే అనసూయ ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ పేరును కానీ సినిమా సెలబ్రిటీల గురించి గానీ మాట్లాడిన దాఖలాలు లేవు.అయినప్పటికీ పవన్ అభిమానులు మాత్రం తాను పరోక్షంగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు అంటూ అనసూయ పై ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు.
మరి ఈ వ్యాఖ్యలపై అనసూయ స్పందన ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.







