తమిళ్ సినిమా( Tamil movie ) ఇండస్ట్రీలో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వాళ్లలో కమల్ హాసన్( Kamal Haasan ) ఒకరు.ఈయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధించాయి.
అలాగే ఆయన తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి హీరో గా గుర్తింపు తెచ్చుకొని మంచి విజయాలను అందుకున్నాడు.ఆయన ప్రయోగాత్మక చిత్రాలను చేయడంలో ఆయనను మించిన వారు ఇంకొకరు లేరు అనే చెప్పాలి.
అలాంటి కమల్ హాసన్ అప్పట్లో మంచి మూవీస్ తీసి ప్రేక్షకులను అలరించడంలో చాలా వరకు సక్సెస్ అయ్యాడు.

ఈయన తీసే సినిమాలు చాలా వెరైటీగా ఉండడంతో జనాలు ఈయన సినిమాలు చూడటానికి ఎక్కువగా ఆసక్తి చూపించేవారు.ప్రస్తుతం ఆయన ఇండస్ట్రీలో లోకనాయకుడిగా గుర్తింపు తెచ్చుకొని ఇప్పటికీ సినిమాలు చేస్తూ అంతకంతకు ఆయన క్రేజ్ ని పెంచుకుంటూ వస్తున్నాడు.అయితే కమల్ హాసన్ తెలుగులో చేసిన శుభసంకల్పం ( subhasankalpam )సినిమాని కె విశ్వనాథ్( K Vishwanath ) మొదటగా మోహన్ బాబుతో చేద్దామని అనుకున్నారంట కానీ మధ్యలో చిన్న బేధాభిప్రాయాలు రావడం వల్ల విశ్వనాథ్ గారు కమల్ హాసన్ తో ఆ సినిమాను తీసినట్టుగా తెలుస్తుంది.
ఇక మోహన్ బాబు చేయాల్సిన క్యారెక్టర్ని కమల్ హాసన్ చేయడంతో మోహన్ బాబు తీవ్ర ఆగ్రహానికి గురై కమలహాసన్ కి చిన్నపాటి వార్నింగ్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది.ఇక అది అలా ఉంటే కమల్ హాసన్ ఆ క్యారెక్టర్ లో నటించడం కాకుండా జీవించేసాడు అనే చెప్పాలి.
అంత అద్బుతం గా నటించి మంచి విజయాన్ని అందుకున్నాడు.ఆ సినిమాలో మోహన్ బాబు చేసి ఉంటే ఆ సినిమాకి అంత మంచి అవుట్ ఫుట్ వచ్చిండేది కాదు అని ఆ సినిమా చూసిన చాలా మంది తర్వాత వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది.
రీసెంట్ గా కమల్ హాసన్ విక్రమ్ అనే సినిమాతో మళ్లీ కంబ్యాక్ ఇచ్చాడు.








