Prabhas : బాహుబలి సినిమా కోసం ప్రభాస్ అలాంటి కండిషన్స్ పెట్టారా… అసలు విషయం చెప్పిన జక్కన్న!

తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో దర్శకదీరుడు ఎస్ఎస్ రాజమౌళి( Rajamouli ) ఒకరు.దర్శకుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

 Prabhas Shocking Conditions For Bahubali Movie Full Details Inside-TeluguStop.com

ఇక తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఈయన పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.బాహుబలి ( Bahubali ) సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన RRR సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో డైరెక్టర్ పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

Telugu Anushka, Baahubali, Prabhas, Rajamouli, Rrr, Tollywood-Movie

కెరియర్ మొదట్లో సీరియల్ డైరెక్టర్ గా పని చేస్తున్నటువంటి రాజమౌళి అనంతరం ఎన్టీఆర్ హీరోగా నటించిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ద్వారా ఈయన దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.అయితే మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి రాజమౌళి అనంతరం తన దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సంచలన మైనటువంటి విజయాలను అందుకొని నిర్మాతలకు భారీ లాభాలను తీసుకువచ్చాయి.

ఇలా ఇండస్ట్రీలో ఒక్కో అడుగు ముందుకు వేస్తూ పాన్ ఇండియా స్థాయిలో సినిమాలను కూడా అందరికీ పరిచయం చేశారు.

Telugu Anushka, Baahubali, Prabhas, Rajamouli, Rrr, Tollywood-Movie

ఇక ప్రభాస్ ( Prabhas ) హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చినటువంటి మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా బాహుబలి ఈ సినిమా ఎలాంటి సంచలనాలను సృష్టించిందో మనకు తెలిసిందే.ఈ సినిమా కోసం దర్శక నిర్మాతలు హీరోలు కూడా ఎంతో కష్టపడి పనిచేశారు అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో రాజమౌళి ప్రభాస్ రానా వంటి వారికి కఠినమైనటువంటి నియమాలను పెట్టి సినిమా షూటింగ్ పూర్తి చేశారని తెలుస్తుంది.అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ కోసం రాజమౌళికి ప్రభాస్ పెట్టిన కండిషన్ గురించి ఒక వార్త వైరల్ గా మారింది.

ప్రభాస్ బాహుబలి సినిమా షూటింగ్ సమయంలో తన శరీర బరువులో ఏ విధమైనటువంటి మార్పులు లేకుండా ఉండడం కోసం కఠినమైనటువంటి డైట్ ఫాలో కావాలని ప్రత్యేకంగా ఒక డైటీషియన్ ను జక్కన్న ఏర్పాటు చేశారట.వారు చెప్పిన విధంగానే ప్రభాస్( Prabhas ) ఫుడ్ తీసుకోవాలి.

ఫుడ్ అంటే ఎంతో ఇష్టం ఉన్నటువంటి ఈయన ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎంతో ఇబ్బంది పడ్డారని తెలుస్తుంది.అయితే బాహుబలి 2 సినిమా షూటింగ్ సమయంలో మాత్రం ప్రభాస్ రాజమౌళికే కండిషన్ పెట్టారట .

Telugu Anushka, Baahubali, Prabhas, Rajamouli, Rrr, Tollywood-Movie

నేను ఈ సినిమాలో నటించాలి అంటే మీరు నేను పెట్టే కండిషన్ కి తప్పకుండా ఒప్పుకోవాలని అప్పుడే నేను ఈ సినిమా షూటింగ్ చేస్తానని ప్రభాస్ రాజమౌళికి కండిషన్ పెట్టారట.మరి ఆయన పెట్టిన ఆ కండిషన్ ఏంటి అనే విషయానికి వస్తే… నేను మీరు చెప్పిన డైట్ కేవలం షూటింగ్ సమయంలో మాత్రమే ఫాలో అవుతాను ఇతర సమయాలలో నాకు నచ్చిన విధంగా నాకు ఇష్టమైన ఫుడ్ తీసుకుంటాను అని చెప్పారట అందుకు మీరు ఒప్పుకోవాలని ఈ కండిషన్ కి ఒప్పుకుంటేనే నేను సినిమా షూటింగ్లో పాల్గొంటాను అంటూ రాజమౌళికి ప్రభాస్ కండిషన్ పెట్టారు.సాధారణంగా ప్రభాస్ మంచి ఫుడీ అనే విషయం మనకు తెలిసిందే.వివిధ రకాల ఆహార పదార్థాలతో ఎంతో ఇష్టంగా ఫుడ్ తీసుకునే ప్రభాస్ ని ఇలా కట్టడి చేయడంతో ఆయన ఫుడ్ విషయంలో రాజమౌళికి కండిషన్ పెట్టారట.

ఇలా ఫుడ్ విషయంలో ప్రభాస్ పరిస్థితి గమనించిన రాజమౌళి ఆ కండిషన్ కి ఒప్పుకొని బాహుబలి 2 సినిమా( Baahubali 2 ) షూటింగ్ పూర్తి చేశారని ఒక వార్త వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube