టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ( Sandeep Reddy Vanga ) గురించి అందరికి పరిచయమే.ఈయన తన కెరీర్ లో తీసింది కొన్ని సినిమాలే అయినా కూడా అవన్నీ ఇంటెన్స్ డ్రామాగా ఆడియెన్స్ ను బాగా అలరించాయి.
ముఖ్యంగా ఈయన తన సినిమాల్లో హీరో హీరోయిన్ల మధ్య అదిరిపోయే కెమిస్ట్రీ టచ్ ఇస్తాడు.ఈయన సినిమాలు ఇప్పటి వరకు అలానే వచ్చాయి.

మన తెలుగులో అర్జున్ రెడ్డి ఎంత సెన్సేషన్ సృష్టించిందో చెప్పాల్సిన పని లేదు.మరి అంతకు మించిన రొమాన్స్ తో ఇప్పుడు ”యానిమల్”( Animal ) గా సందీప్ రెడ్డి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ‘యానిమల్’ సినిమాపై ఇప్పటికే పాన్ ఇండియన్ వ్యాప్తంగా అంచనాలు క్రియేట్ చేయడంలో టీమ్ సక్సెస్ అయ్యారు.
ఇక ఇప్పటికే వీరిద్దరి ఫస్ట్ లుక్స్ తో పాటు విలన్ గా నటిస్తున్న బాబీ డియోల్ ఫస్ట్ లుక్( Bobby Deol First Look ) అలాగే టీజర్ కూడా రిలీజ్ చేసారు.
ఇక ఇప్పుడు ఫస్ట్ సింగిల్ రిలీజ్ తో అంచనాలు పీక్స్ కు చేర్చారు.ఎందుకంటే అమ్మాయి అంటూ సాగే ఈ ఫస్ట్ సింగిల్ ఆద్యంతం కూడా రణబీర్, రష్మిక రొమాన్స్( Ranbir,Rashmika ROmance ) చేయించాడు.
సందీప్ మార్క్ ఈ సాంగ్ లో బాగా కనిపించింది.

ఈ సాంగ్ లో పెద్దలు వీరి పెళ్ళికి ఒప్పుకోలేక పోవడంతో ఇద్దరు వారి ముందే ముద్దు పెట్టుకోవడంతో స్టార్ట్ అయ్యి ఆ తర్వాత కేదారనాథ్( Kedaranath ) లో పెళ్లి చేసుకోవడంతో ముగుస్తుంది.ఈ సాంగ్ మొత్తం ప్రేమతో కూడిన రొమాన్స్ చూపించారు.లిప్ లాక్స్ తో ఈ జంట అదరగొట్టారు.
రష్మిక, రణబీర్ మధ్య కెమిస్ట్రీ చాలా అందంగా ఆడియెన్స్ కు కనెక్ట్ అయ్యింది.మరి పూర్తి సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.
కాగా డిసెంబర్ 1న గ్రాండ్ గా పాన్ ఇండియా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు హర్ష వర్ధన్ సంగీతం అందిస్తుండగా టి సిరీస్, భద్రకాళి పిక్చర్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.







