తెలంగాణ ఎన్నికలు : ఆ రథాలకు పెరిగిన డిమాండ్ ! 

తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో పల్లెలు ,పట్టణాలు అనే తేడా లేకుండా అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంలోకి దిగాయి.కొన్ని పార్టీలు తమ పార్టీ మేనిఫెస్టోను ప్రకటించగా,  మరికొన్ని ప్రకటించేందుకు కసరత్తు  చేస్తున్నాయి.

 Full Demand For Campaign Vehicles During Telangana Elections Details, Telangana-TeluguStop.com

 ఇక బీఆర్ఎస్( BRS ) అభ్యర్థుల జాబితాను ప్రకటించగా కాంగ్రెస్, బిజెపి మరికొద్ది రోజుల్లోనే ఆ జాబితాను ప్రకటించి పూర్తిస్థాయిలో ఎన్నికల కథన రంగంలోకి దూకబోతున్నాయి.ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా అన్ని పార్టీలు తీసుకోవడంతో, ఆ స్థాయిలోనే ప్రచారానికి దిగుతున్నాయి.

పల్లెలు,  పట్టణాల్లోనే తేడా లేకుండా, ప్రతి ఓటర్ ని కలిసే విధంగా రాజకీయ పార్టీలు( Political Parties ) వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేసి, పార్టీ కార్యకర్తలు, నాయకులను జనాల్లోకి పంపుతున్నాయి.ఈ కొద్ది రోజుల్లో ఎవరు ఎక్కువగా ప్రచారం చేసుకుని తమ వాదనను వినిపించగలిగితే వారికి ఎక్కువ గెలుపు అవకాశాలు ఉండడంతో, ఎన్నికల ప్రచారాన్ని( Elections Campaign Vehicles ) మరింత ఉధృతం చేసే పనిలో నిమగ్నం అయ్యాయి.

Telugu Brs, Congress, Flex Vehicles, Vehicles, Telangana-Politics

దీనిలో భాగంగా ఎన్నికల ప్రచార రథాలను సిద్ధం చేసుకున్నాయి.దీంతో ఎన్నికల ప్రచార రథాలకు భారీగా డిమాండ్ ఏర్పడింది.కొన్ని పార్టీలు సొంతంగానే ఎన్నికల ప్రచార రధాలను( Election Vehicles ) తయారు చేయించుకుంటూ ఉండగా, మరికొంతమంది అద్దెకు తీసుకునే ఆలోచనలో ఉన్నారు.  ఫ్లెక్సీ డిజైనర్స్ , ఆర్టిస్టులు, ప్రచార రథా ల తయారదారులు బిజీగా మారారు.

అభ్యర్థులు పార్టీల స్థానం బట్టి ప్రచార రథాలను రూపొందిస్తున్నారు.ఓటర్లను ను ఆకట్టుకునే విధంగా వాహనాలను రూపొందిస్తూ, ఆ ప్రచార రథాలకు పార్టీ గుర్తులు, నాయకుల ఫోటోలు వేస్తున్నారు.

Telugu Brs, Congress, Flex Vehicles, Vehicles, Telangana-Politics

అలాగే వాహనాలకు డెకరేషన్ చేసి మైక్ సెట్ ను, డిజిటల్ టెక్నాలజీ పెరగడంతో, డిజిటల్ ఫ్లెక్సీ వాహనాలకు భారీగా డిమాండ్ ఏర్పడింది.ఇప్పటికే అధికార పార్టీ బీఆర్ఎస్ తమ అభ్యర్థుల జాబితా ప్రకటించడంతో , ఈ వాహనాలను సిద్ధం చేసుకునే జాబితాలో ఆ పార్టీ నాయకులు  ఉన్నారు.ఇక కాంగ్రెస్( Congress ) బిజెపిలలో( BJP ) టిక్కెట్ ఖాయం అనుకున్న నేతలు ప్రచార రథలకు ఆర్డర్లు ఇచ్చారు.ఒక్కో అభ్యర్థి నాలుగు నుంచి ఐదు ప్రచార రథాలను తయారు చేసుకుంటున్నట్లు సమాచారం.

హైదరాబాద్ తో పాటు, రాజమండ్రి , పూణే తదితరచోట్ల ఎన్నికల ప్రచార వాహనాలు సిద్ధమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube