తెలంగాణ ఎన్నికలు : ఆ రథాలకు పెరిగిన డిమాండ్ ! 

తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో పల్లెలు ,పట్టణాలు అనే తేడా లేకుండా అన్ని రాజకీయ పార్టీలు ప్రచారంలోకి దిగాయి.

కొన్ని పార్టీలు తమ పార్టీ మేనిఫెస్టోను ప్రకటించగా,  మరికొన్ని ప్రకటించేందుకు కసరత్తు  చేస్తున్నాయి.

 ఇక బీఆర్ఎస్( BRS ) అభ్యర్థుల జాబితాను ప్రకటించగా కాంగ్రెస్, బిజెపి మరికొద్ది రోజుల్లోనే ఆ జాబితాను ప్రకటించి పూర్తిస్థాయిలో ఎన్నికల కథన రంగంలోకి దూకబోతున్నాయి.

ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా అన్ని పార్టీలు తీసుకోవడంతో, ఆ స్థాయిలోనే ప్రచారానికి దిగుతున్నాయి.

పల్లెలు,  పట్టణాల్లోనే తేడా లేకుండా, ప్రతి ఓటర్ ని కలిసే విధంగా రాజకీయ పార్టీలు( Political Parties ) వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేసి, పార్టీ కార్యకర్తలు, నాయకులను జనాల్లోకి పంపుతున్నాయి.

ఈ కొద్ది రోజుల్లో ఎవరు ఎక్కువగా ప్రచారం చేసుకుని తమ వాదనను వినిపించగలిగితే వారికి ఎక్కువ గెలుపు అవకాశాలు ఉండడంతో, ఎన్నికల ప్రచారాన్ని( Elections Campaign Vehicles ) మరింత ఉధృతం చేసే పనిలో నిమగ్నం అయ్యాయి.

"""/" / దీనిలో భాగంగా ఎన్నికల ప్రచార రథాలను సిద్ధం చేసుకున్నాయి.దీంతో ఎన్నికల ప్రచార రథాలకు భారీగా డిమాండ్ ఏర్పడింది.

కొన్ని పార్టీలు సొంతంగానే ఎన్నికల ప్రచార రధాలను( Election Vehicles ) తయారు చేయించుకుంటూ ఉండగా, మరికొంతమంది అద్దెకు తీసుకునే ఆలోచనలో ఉన్నారు.

  ఫ్లెక్సీ డిజైనర్స్ , ఆర్టిస్టులు, ప్రచార రథా ల తయారదారులు బిజీగా మారారు.

అభ్యర్థులు పార్టీల స్థానం బట్టి ప్రచార రథాలను రూపొందిస్తున్నారు.ఓటర్లను ను ఆకట్టుకునే విధంగా వాహనాలను రూపొందిస్తూ, ఆ ప్రచార రథాలకు పార్టీ గుర్తులు, నాయకుల ఫోటోలు వేస్తున్నారు.

"""/" / అలాగే వాహనాలకు డెకరేషన్ చేసి మైక్ సెట్ ను, డిజిటల్ టెక్నాలజీ పెరగడంతో, డిజిటల్ ఫ్లెక్సీ వాహనాలకు భారీగా డిమాండ్ ఏర్పడింది.

ఇప్పటికే అధికార పార్టీ బీఆర్ఎస్ తమ అభ్యర్థుల జాబితా ప్రకటించడంతో , ఈ వాహనాలను సిద్ధం చేసుకునే జాబితాలో ఆ పార్టీ నాయకులు  ఉన్నారు.

ఇక కాంగ్రెస్( Congress ) బిజెపిలలో( BJP ) టిక్కెట్ ఖాయం అనుకున్న నేతలు ప్రచార రథలకు ఆర్డర్లు ఇచ్చారు.

ఒక్కో అభ్యర్థి నాలుగు నుంచి ఐదు ప్రచార రథాలను తయారు చేసుకుంటున్నట్లు సమాచారం.

హైదరాబాద్ తో పాటు, రాజమండ్రి , పూణే తదితరచోట్ల ఎన్నికల ప్రచార వాహనాలు సిద్ధమవుతున్నాయి.