టాలీవుడ్ ఇండస్ట్రీలో టాలెంట్ తో ఊహించని స్థాయిలో గుర్తింపును సంపాదించుకోవడంతో పాటు సినీ అభిమానులకు దగ్గరైన వారిలో బాబు మోహన్( Babu Mohan ) ఒకరు.తాజాగా ఒక సందర్భంలో బాబు మోహన్ తన కన్నీటి కష్టాలను వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి.
ఈవీవీ సత్యనారాయణ వల్లే తాను బ్రతికి ఉన్నానని బాబు మోహన్ చెప్పుకొచ్చారు.తాను సినిమాలు చేసే సమయంలో రెమ్యునరేషన్ కు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదని అన్నారు.

చాలామంది నిర్మాతలు అడ్వాన్స్ లు ఇచ్చేవారని డబ్బింగ్ సమయంలో చెక్ ఇస్తామని చెప్పి ఇచ్చేవారు కాదని బాబు మోహన్ అన్నారు.మరి కొందరు నిర్మాతలు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయని తాజాగా ఇల్లు మారిన సమయంలో ఇంట్లో చెల్లని చెక్కులు కుప్పలు కుప్పలుగా ఉన్నాయని బాబు మోహన్ చెప్పుకొచ్చారు.నాకు హీరోగా నటించే మూవీ ఆఫర్లు( Babu Mohan Movie Offers ) సైతం వచ్చాయని కొన్ని కారణాల వల్ల ఆ ఆఫర్లకు నో చెప్పాల్సి వచ్చిందని ఆయన తెలిపారు.
కొడుకు మరణం( Babu Mohan Son Death ) నన్ను ఎంతగానో బాధ పెట్టిందని ఒకానొక సమయంలో డిప్రెషన్( Depression ) వల్ల తాను చనిపోవాలని అనుకున్నానని బాబు మోహన్ పేర్కొన్నారు.
ఆ సమయంలో దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ వల్ల తాను మామూలు మనిషిని కావడం సాధ్యమైందని బాబు మోహన్ కామెంట్లు చేయడం గమనార్హం.ఈవీవీ సత్యనారాయణ సినిమాల షూటింగ్ లకు తీసుకెళ్లి నా మనస్సు మార్చారని ఆయన తెలిపారు.

బాబు మోహన్ రాజకీయాల్లో సైతం ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం బీజేపీ( BJP )లో ఉన్న బాబు మోహన్ రాబోయే రోజుల్లో రాజకీయాల్లో సైతం అనుకూల ఫలితాలను సొంతం చేసుకుంటానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.బాబు మోహన్ తన సినీ కెరీర్ లో వివాదాలకు దూరంగా ఉన్నారు.బాబు మోహన్ కామెడీ టైమింగ్ కు పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.