గోల్డెన్ వీసా( Golden visa ) గురించి మీరు ఒకచోటే విని వుంటారు.అవును, మీరు విన్నది నిజమే.
వివిధ రంగాల్లో తమ దేశానికి విశేష కృషి చేసిన వ్యక్తులకు యూఏఈ ప్రభుత్వం ఈ గోల్డెన్ వీసాని మంజూరు చేస్తుంది.ఈ గోల్డెన్ వీసా ద్వారా ఆ దేశంలో దీర్ఘకాలిక రెసిడెన్సీకి చాలా వీలు కలుగుతుంది.
యూఏఈ ఇచ్చే ఈ లాంగ్‌టర్మ్ వీసా 10, 5ఏళ్ల కాలపరిమితో( UAE government ) ఉంటుందని మీలో కొంతమందికి తెలుసు.అది మాత్రమే కాకుండా ఈ వీసా ఆటోమేటిక్ గా రెన్యూవల్ చేయబడుతుంది.
ఇకపోతే 2019లో యూఏఈ ప్రభుత్వం ఈ దీర్ఘకాలిక రెసిడెన్సీ వీసాల కోసం ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది.ఈ వ్యవస్థ యూఏఈలో విదేశీయులకు ఎలాంటి స్పాన్సర్షిప్ అవసరం లేకుండా నివాసం, పనిచేసుకోవడం, అధ్యయనంకు వీలు కల్పిస్తుంది.

ఇక దీనివలన ఎన్ని లాభాలు వుంటాయో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.దీనివలన దీర్ఘకాలిక, పునరుత్పాదక నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు అక్కడ.అదేవిధంగా స్పాన్సర్ లేదా యజమాని అనేవాడు అక్కడ అవసరం లేదు.సాధారణంగా యూఏఈలో నివాస వీసాలకు స్పాన్సర్ అవసరం.ఇది వున్నవారికి అలాంటి అవసరం లేదు.గోల్డెన్ వీసా కలిగి ఉండటం వల్ల ఉద్యోగాలను మరింత సులభంగా మార్చగలిగే కార్మికులకు ఎంతో సహాయపడుతుంది.
ఎందుకంటే వారి మునుపటి యజమాని స్పాన్సర్ చేసిన వారి నివాస వీసాను రద్దు చేయవలసిన అవసరం లేదు.

ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే, 6 నెలల కంటే ఎక్కువ కాలం యూఏఈ వెలుపల ఉన్నా కూడా నివాస వీసా రద్దు కానే కాదు.అదే సాధారణంగా నివాసి ఆరు నెలల కంటే ఎక్కువ కాలం దేశం వెలుపల ఉంటే నివాస వీసా అనేది రద్దు చేయబడుతుంది.అలాగే గోల్డెన్ వీసా వ్యవస్థ ప్రాయోజిత కుటుంబ సభ్యులకు గోల్డెన్ వీసా ప్రాథమిక హోల్డర్ మరణిస్తే, ప్రాయోజిత సభ్యుల అనుమతి చెల్లుబాటు అవుతుందని హామీ ఇస్తుంది.
లెస్సన్స్ లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునే వెసులుబాటు వుంటుంది.ఆ తర్వాత మీరు రెండు పరీక్షలలో ఉత్తీర్ణులైతే చాలు.మీరు యూఏఈ డ్రైవింగ్ లైసెన్స్ ని ఇచ్చేస్తుంది.అన్నింటికంటే ముఖ్యంగా ప్రత్యేకమైన ఆరోగ్య బీమా ప్యాకేజీలు వుంటాయి.
దుబాయ్, అబుదాబి( Dubai ) లో ఫుల్ టైమ్ ఉద్యోగులుగా ఉన్న గోల్డెన్ వీసాదారులు వారి యజమానికి సంబంధించిన ఆరోగ్య బీమా పాలసీ పరిధిలో కొనసాగుతారు.







