వరుణ్ తేజ్ లావణ్య పెళ్లి వేదిక డెకరేషన్ చూశారా... ఫోటోలను లీక్ చేసిన ఉపాసన!

మెగా కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు ఒక చిన్న వీక్నెస్ ఉంది అనే విషయం మనకు తెలిసిందే.వారి సినిమాలకు సంబంధించిన విషయాల గురించి లేదా ఇతర విషయాలు గురించి అయినా ఇప్పటివరకు చిరంజీవి అల్లు అర్జున్ పెద్ద ఎత్తున లీక్స్ చేస్తూ ఉండేవారు.

 Upasana Shares Lavana Varun Wedding Venue Decoration Photos Goes Viral, Lavanaya-TeluguStop.com

దీంతో చిరు లీక్స్ బన్నీ లీక్స్ అంటూ అభిమానుల పేర్లు కూడా పెట్టేశారు.ఇప్పుడు ఈ జాబితాలోకి ఉపాసన( Upasana ) కూడా వచ్చి చేరిందని చెప్పాలి.

వరుణ్ తేజ్( Varun tej ) లావణ్య ( Lavanya ) పెళ్లి గురించి అన్ని విషయాలను సీక్రెట్ గా ఉంచినప్పటికీ ఉపాసన మాత్రం వరుసగా వీరు పెళ్లికి సంబంధించిన విషయాలన్నింటినీ లీక్ చేస్తూ వస్తున్నారు.ఇప్పటికే వీరి వివాహం ఇటలీలోని టుస్కానీ నగరంలో జరగబోతుంది అంటూ ఉపాసన లీక్ చేసిన విషయం మనకు తెలిసిందే.

Telugu Lavanaya, Upasana, Varun Tej-Movie

ఇప్పటివరకు వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఎక్కడ పెళ్లి చేసుకోబోతున్నారు అనే విషయం గురించి వెల్లడించకపోయిన ఉపాసన మాత్రం ఆ విషయాన్ని బయట పెట్టేయడంతో వీరి వివాహం ఇటలీ( Italy ) లో జరగబోతుందని అర్థమవుతుంది.తాజాగా ఉపాసన సోషల్ మీడియా వేదికగా కొన్ని డెకరేషన్స్ కి సంబంధించినటువంటి ఫోటోలను కూడా షేర్ చేశారు దీంతో కచ్చితంగా ఇటలీలో జరగబోయే వరుణ్ తేజ్ వివాహ వేడుకలకు సంబంధించిన డెకరేషన్ ఫోటోలను ఈమె సోషల్ మీడియాలో షేర్ చేశారు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Telugu Lavanaya, Upasana, Varun Tej-Movie

ఈ పోస్టు చూస్తుంటే.ఇటలీలో అంగరంగా వైభవంగా వరుణ్, లావణ్య పెళ్లిని చేయబోతున్నట్లు తెలుస్తుంది.కాగా పెళ్లి తేదీ పై ఇంకా ఎటువంటి క్లారిటీ రాలేదు. బహుశా వీరి వివాహం నవంబర్ మొదటి వారంలో ఉండవచ్చని వార్తలు వైరల్ అవుతున్నాయి.అయితే త్వరలోనే వీరి పెళ్లి తేది కూడా ప్రకటించబోతున్నారని తెలుస్తోంది.ఇక ప్రస్తుతం మెగా కుటుంబ సభ్యులందరూ కూడా ఈ పెళ్లి పనులలో ఎంతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే.

వీరి వివాహం జరగబోతున్నటువంటి నేపథ్యంలో చిరంజీవి కూడా తన ఇంట్లో మెగా అల్లు కుటుంబ సభ్యులందరికీ కూడా గ్రాండ్గా పార్టీ కూడా ఇచ్చారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube