ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కృష్ణంరాజు( Krishnam Raju ) గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఇండస్ట్రీకి ఎన్నో సేవలు చేసి గత ఏడాది అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించారు.ఇలా కృష్ణంరాజు గారు మరణించి ఏడాది పూర్తి అయింది అయితే కృష్ణంరాజు గారు మరణించిన తర్వాత వారి సొంత గ్రామంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కోసం ప్రత్యేకంగా ఒక విగ్రహాన్ని తయారు చేసిన సంగతి మనకు తెలిసిందే.
అయితే ప్రభాస్ కి తెలియకుండా తన పెద్దమ్మ శ్యామల దేవి (Shyamala Devi) మరొక విగ్రహాన్ని కూడా తయారు చేయించారట.

ప్రభాస్ కి తెలియకుండా తన పెదనాన్న విగ్రహాన్ని తయారు చేయించి ఇంట్లో పెట్టినటువంటి శ్యామలాదేవి( Shyamaladevi ) తాజాగా ఈ విగ్రహానికి సంబంధించినటువంటి వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసారు.అయితే ఈ విగ్రహం కృష్ణంరాజు గారిని పోలీ ఉంది.ఈ విగ్రహం చూస్తే కనుక ఆయన నిజంగానే బ్రతికి ఉన్నారేమో అన్న భావన తప్పకుండా కలుగుతుంది.
అంత అద్భుతంగా ఈ విగ్రహాన్ని తీర్చిదిద్దారు.కృష్ణంరాజు విగ్రహాన్ని ఇంట్లో తయారు చేయించి పెట్టినప్పుడు ప్రభాస్ సడన్ గా ఆ విగ్రహం చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారట.
అసలు ఇది విగ్రహమా లేక నిజమైన మనిషా అన్న భావనలో ప్రభాస్ ఉండిపోయారని శ్యామలాదేవి వెల్లడించారు.

ఇలా ఐదు నిమిషాల పాటు ప్రభాస్ తన పెదనాన్న విగ్రహం వంక చూస్తూనే ఉన్నారని, శ్యామలాదేవి ఈ సందర్భంగా తెలియజేశారు.కృష్ణంరాజు కొడుకులు లేకపోవడంతో తన వారసుడిగా ప్రభాస్ ని ఈయన ఇండస్ట్రీకి పరిచయం చేశారు.ఇక ప్రభాస్ సైతం ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
ఇక తన పెదనాన్న అంటే ఎంతో ప్రాణం ఇచ్చే ప్రభాస్ ( Prabhas ) ఆయన మరణించిన సమయంలో ఎంతో ఎమోషనల్ అయ్యారు.ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే.
సలార్ సినిమా( Salaar Movie ) ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.







