జనగామ ప్రజాప్రతినిధులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కీలక భేటీ అయ్యారు.హైదరాబాద్ మినిస్టర్స్ క్వార్టర్స్ లో ఈ సమావేశం జరిగింది.
కాగా ఈ సమావేశానికి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే రాజయ్య సహా పలువురు నేతలు హాజరయ్యారు.ఈ సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
ముత్తిరెడ్డి రాజకీయ జీవితానికి ఇది తాత్కాలిక విరామమేనని తెలిపారు.ముత్తిరెడ్డికి రాజకీయ జీవితం ఇంకా ఉందన్న కేటీఆర్ ముత్తిరెడ్డి, పల్లా కలిసి పని చేయాలని సూచించారు.







