ఇటీవలే కాలంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా అత్యాచారాలకు పాల్పడే వారి సంఖ్య అధికంగా పెరుగుతోంది.ఇక అభం శుభం తెలియని మైనర్ ఆడపిల్లలపై( Minor Girl ) అఘాయిత్యాలు పెరుగుతున్నాయే తప్ప.
కామాంధుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది అనడానికి ఈ సంఘటనే నిదర్శనం.ఒక మైనర్ బాలికపై అత్యాచారం జరిగిన ఘటన జనగామ జిల్లాలో( Janagama ) సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అసలు ఏం జరిగిందో అనే వివరాలు చూద్దాం.

స్టేషన్ ఘన్పూర్ సీఐ సట్ల రాజు తెలిపిన వివరాల ప్రకారం.స్టేషన్ ఘన్పూర్ మండలం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన 23 ఏళ్ల వయసున్న యువకుడు ఆటో డ్రైవర్ గా( Auto Driver ) పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.అయితే అతని ఇంటి సమీపంలో ఉంటున్నా ఓ 15 ఏళ్ల మైనర్ బాలికపై కన్నేశాడు.
ఆ బాలికను శారీరకంగా వశపరచుకొని పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.దీంతో ఆ బాలిక గర్భం దాల్చింది.ప్రస్తుతం ఆ బాలిక ఐదు నెలల గర్భవతి.

తాజాగా సోమవారం ఆ బాలిక గర్భం ( Pregnant ) దాల్చిన విషయం కుటుంబ సభ్యులకు తెలిసింది.కుటుంబ సభ్యులంతా కలిసి స్టేషన్ ఘన్పూర్ పోలీసులను ఆశ్రయించి ఆటోడ్రైవర్ పై కేసు పెట్టారు.సీఐ సట్ల రాజు విచారణ ప్రారంభించి బాలిక తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
ఈ విషయం నిందితుడికి తెలియడంతో పరారీలో ఉన్నాడు.నిందితుడికి భార్య, తల్లిదండ్రులు ఉన్నారు.వారి ద్వారా విచారణ ప్రారంభించి త్వరలోనే నిందితుడిని అదుపులోకి తీసుకొని కఠినంగా శిక్షిస్తామని సీఐ కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.బాలిక గర్భం దాల్చిన విషయం గ్రామంలో తెలియడంతో గ్రామస్తులు నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నారు.







