సినిమాలు వేరు రాజకీయాలు వేరు అనే సంగతి మన అందరికీ తెలిసిందే.కానీ దురదృష్టం కొద్దీ మన ఆంధ్ర ప్రదేశ్ లో సినిమాలు ఇప్పుడు ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్ళిపోయింది.
పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘వకీల్ సాబ్( Vakeel Saab )’ సినిమా నుండి ఇది మొదలైంది.అర్థ రాత్రి అప్పటికప్పుడు సరికొత్త జీవో ని తీసుకొచ్చి, దానిని రెండు రోజుల్లో అమలు చేయించి వకీల్ సాబ్ మూవీ వసూళ్లు పై దెబ్బ కొట్టాలని చూసారు.
సక్సెస్ అయ్యారు కూడా, ఆ తర్వాత వచ్చిన భీమ్లా నాయక్ చిత్రాన్ని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఏ రేంజ్ లో తొక్కిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.మొదటి రోజు నుండే చిల్లర టికెట్ రేట్స్ ఉండడం వల్ల ఈ సినిమాకి అదనంగా రావాల్సిన 30 కోట్లు రాకుండా పోయాయి.
జనసేన మరియు వైసీపీ పార్టీల మధ్య రాజకీయంగా ఉన్న గొడవల్ని, వేలాది మంది నమ్ముకున్న సినిమా మీద చూపించే ప్రయత్నం చేసాడు జగన్.
అలాంటి జగన్ బయోపిక్ ని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ) నిర్మించబోతున్నాడా?, పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తుంది.రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ కి ఎంతో ఇష్టమైన వ్యక్తి.అన్నయ్య చిరంజీవి కొడుకు అయ్యినప్పటికీ కూడా తన సొంత కొడుకు లాగానే ట్రీట్ చేస్తాడు.
అలాంటి రామ్ చార , పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రత్యర్థి బయోపిక్ నిర్మాణం లో భాగం అయ్యాడు.అసలు విషయం లోకి వెళ్తే మహేష్ పీ.రాఘవ్ అనే డైరెక్టర్ యాత్ర సినిమాకి సీక్వెల్ గా ‘యాత్ర 2( Yatra 2 ) ‘ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.మొదటి భాగం వై ఎస్ రాజశేఖర్ రెడ్డి మీద తియ్యగా, రెండవ భాగం జగన్ రాజకీయా ప్రస్తావన మీద తియ్యబోతున్నట్టు ఎప్పుడో ప్రకటించారు.
కానీ షూటింగ్ ఈమధ్యనే ప్రారంభం అయ్యింది.ఈ చిత్రం లో జగన్ పాత్ర ని తమిళ హీరో జీవా పోషిస్తున్నాడు.
ఈ సినిమాకి సంబంధించి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ డిస్ట్రిబ్యూషన్ హక్కులను యూవీ క్రియేషన్ బ్యానర్స్ తీసుకుంది.యూవీ క్రియేషన్స్ ప్రభాస్ వాళ్ళ అన్నయ్య బ్యానర్ అనే సంగతి అందరికీ తెలిసిందే.ఈ బ్యానర్ లో ప్రభాస్ తో పాటుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి కూడా భాగస్వామం ఉంది.ఈ బ్యానర్ లో విక్కీ రెడ్డి అనే అతనితో కలిసి రామ్ చరణ్ వీ మెగా టాకీస్ అనే బ్యానర్ ని స్థాపించారు.
మొదటి సినిమా హీరో నిఖిల్ తో ‘ది ఇండియా హౌస్’ నిర్మించబోతున్నట్టుగా అధికారికంగా తెలిపారు.యూవీ క్రియేషన్స్ కి సంబంధించి ప్రతీ విషయం లో భాగం ఉన్న రామ్ చరణ్, ఈ ‘యాత్ర 2 ‘ బిజినెస్ లావాదేవీల విషయం లో భాగం ఉన్నట్టే.
దీనిపై పవన్ అభిమానుల నుండి సోషల్ మీడియా లో వచ్చే నెగటివిటీ ని రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎలా తట్టుకుంటారో చూడాలి.