నేచురల్ స్టార్ నాని( Nani ) హీరో గా రూపొందుతున్న హాయ్ నాన్న సినిమా( Hi Nanna ) విడుదల విషయం లో గందరగోళం నెలకొంది.మొన్నటి వరకు క్రిస్మస్ కానుకగా విడుదల చేయాలని భావించారు.
కానీ ఆ సమయంలో పోటీ మరీ ఎక్కువగా ఉంది.దాంతో నాని సినిమా ను కాస్త ముందుగానే విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం అందుతోంది.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం డిసెంబర్ రెండో వారం లోనే సినిమా ను విడుదల చేస్తారట.మొదటి వారం లో విడుదల చేయాలని భావించినప్పటికి ఎన్నికల హడావుడి తగ్గదు.

కనుక తప్పనిసరి పరిస్థితుల్లో రెండో వారం లో విడుదల చేస్తామని అంటున్నారు.అధికారికంగా విడుదల తేదీ విషయం లో ఏ క్షణం లో అయినా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.ప్రస్తుతం హాయ్ నాన్న కు సంబంధించిన షూటింగ్ ముగింపు దశకు వచ్చింది.అంతే కాకుండా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మెల్ల మెల్లగా చేస్తున్నారు.ఇంకా రెండు నెలల సమయం ఉన్నా కూడా అప్పుడే రెండు పాటలను విడుదల చేయడం తో పాటు షూటింగ్ ముగించబోతున్నారు.ఇక సినిమా నుంచి వచ్చిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

వచ్చే నెల రెండో వారంలో సినిమా ట్రైలర్ ని విడుదల చేయబోతున్నారు.సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్( Mrunal Thakur ) ఈ సినిమా లో హీరోయిన్ గా నటించడం వల్ల అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.నాని మరియు మృణాల్ భలే సెట్ అయింది అంటూ ఇద్దరి కాంబో ని పాటలు వీడియోల్లో చూస్తూ ఉంటే అనిపిస్తుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.ప్రస్తుతం నాని మరియు మృణాల్ లపై కీలకమైన చివరి షెడ్యూల్ ని చేస్తున్నారట.
షూటింగ్ అయితే అనుకున్న సమయంకి పూర్తి అయ్యేలా ఉంది.అలాగే ప్రమోషన్ కూడా మొదలు పెట్టారు.
కానీ ఇప్పటి వరకు విడుదల తేదీ విషయం లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం తో అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.







