తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ( Telangana Assembly Elections )రంగం సిద్ధమైంది.కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ రిలీజ్ చేయడంతో రాష్ట్రంలో అధికారికంగా ఎన్నికల హడావుడి మొదలైపోయింది.
ఇప్పటికే ప్రతిపక్షాలకు అందనంత ఎత్తులో ముందుకు దూసుకెళ్తున్న అధికార బారాస ప్రచారానికి ముహూర్తాలు కూడా నిర్ణయించేసింది.ఈ నెల 15వ తారీకుతో మొదలుపెట్టి ప్రతి నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ పెట్టే విధంగా ముందుకు దూసుకెళ్తుంది.
ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న బారతీయ రాష్ట్ర సమితి( BRS PARTY ) మరిన్ని కొత్త పథకాలను, కీలకమైన హామీలను ఇచ్చే దిశగా ఏర్పాటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది.మరోవైపు నిన్న మొన్నటి వరకు కాస్త వెనకబడినట్లు కనిపించిన కాంగ్రెస్ ఇప్పుడు పూర్తిస్థాయి లో దూకుడు పెంచింది.
కీలక నేతలను అధికార పార్టీలో అసంతృప్తి నేతలను ఆకర్షించగలిగిన కాంగ్రెస్ ఇప్పుడు అన్ని నియోజకవర్గాలలోనూ డి అంటే ఢీ అనే అభ్యర్థులను సంపాదించుకోగలిగింది .

దాంతో రాబోయే ఎన్నికలు హోరాహోరీగా జరిగే అవకాశం కనిపిస్తుంది.అయితే సందట్లో సడేమియాలా ఎన్నికల రణ రంగంలోకి దూసుకొస్తున్న కొన్ని చిన్న పార్టీలు ఈ పెద్ద పార్టీల తలరాతలను మార్చే అవకాశం కనిపిస్తుంది.అందులో ముఖ్యంగా కోదండరాం పార్టీ, వైఎస్ఆర్ టిపి జనసేన ,తెలుగుదేశం, బిఎస్పి వంటి పార్టీలు కనిపిస్తున్నాయి .వీటన్నిటికీ వ్యక్తిగతంగా గెలిచే శక్తి లేనప్పటికీ తమదంటూ కొంత ఓట్ బ్యాంకు ఉంది.ప్రతి నియోజకవర్గానికి నాలుగు నుంచి ఐదువేల ఓట్లు ఈ పార్టీలు గనుక చీల్చగలిగితే అవి ఖచ్చితంగా ప్రధాన పార్టీల జాతకాన్ని మారుస్తాయని చెప్పవచ్చు.
ముఖ్యంగా తెలుగుదేశం, బీఎస్పీ ఈ రేసులో ముందున్నట్లుగా చెప్పవచ్చు.</br

తెలంగాణ ఏర్పాటుకు ముందు అధికారం చలాయించిన టిడిపికి నియోజకవర్గం వారిగా కొంత ఓట్ బ్యాంక్ ఉంది .అదే విధంగా జనసేనకు కూడా ఆంధ్రమూలాలు ఉన్న నియోజకవర్గాలలో ఎంతో కొంత పట్టు ఉంది .దళిత, క్రిస్టియన్ నియోజకవర్గాలలో బీఎస్పీ నేత ప్రవీణ్ కుమార్( R S Praveen Kumar ) కు సపరేట్ ఓటు బ్యాంకు ఉంది దాంతో ఆయా పార్టీలకు పడే ఓట్లు ఎవరి ఓటు బ్యాంకు ను చీలుస్తాయి అన్నదే పెద్ద ప్రశ్నగా మారింది.హోరాహోరీ పోరులో ఒక్కొక్కసారి 10 ఓట్లు కూడా ముఖ్యమవుతాయి అలాంటప్పుడు ఈ చిన్న పార్టీలకు పడే ఓట్లు పెద్ద ప్రభావమే చూపించే అవకాశం ఉంది.అందువల్ల ఆయా నియోజకవర్గాల్లో ఇప్పుడు అభ్యర్థులు ఈ చిన్న పార్టీల గురించి టెన్షన్ పడుతున్నట్లుగా తెలుస్తుందిఈ పార్టీ లు ప్రభుత్వ వ్యతిరేకతను వోటు ని చీల్చగలిగితే బారాస మరోసారి గద్దె నేక్కుతుంది .లేకపోతే కాంగ్రెస్కు లాభపడుతుబంది .ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఈ చిన్న పార్టీల రాజకీయం గురించి రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతుంది.







