వైరల్: కోహ్లీకి గోల్డ్ మెడల్.. ఎందుకంటే?

వన్డే ప్రపంచకప్ 23లో టీమిండియా విజయవంతంగా బోణీ కొట్టేసింది.ఆస్ట్రేలియాతో జరిగిన పోరులో భారత్ 6 వికెట్ల తేడాతో విజయ దుందుభి మ్రోగించింది.

 Virat Kohli Wins Gold Medal By Team For Best Fielding Against Australia In Icc O-TeluguStop.com

భారత్ విజయంలో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి కీ రోల్ ప్లే చేశారు.భారత్ తరఫున కోహ్లి( Virat Kohli ) 85 పరుగుల ఇన్నింగ్స్ ఆడగా, రాహుల్( KL Rahul ) 97 పరుగులతో అజేయంగా నిలిచాడు.

ఇద్దరి సూపర్ భాగస్వామ్యంతో టీమిండియా తన వేట షురూ చేసింది.కాగా మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రత్యేక విజయం సాధించిన భారత ఆటగాళ్లను డ్రెస్సింగ్ రూంలో టీమిండియా కోచింగ్ స్టాఫ్ సత్కరించింది.

Telugu Australia, Gold Medal, Icc Odi Wc, Kohli, Mitchell Marsh, Latest, Viratko

అవును, విరాట్ కోహ్లీ తన అద్భుతమైన బ్యాటింగ్, ఫీల్డింగ్ కు గోల్డ్ మెడల్( Gold Medal ) దక్కించుకోగా మిచెల్ మార్ష్( Mitchell Marsh ) ఇచ్చిన క్యాచ్ పట్టినందుకు ఈ గోల్డ్ మెడల్ దక్కింది.అయితే, గోల్డ్ మెడల్ తీసుకునేటప్పుడు కోహ్లీ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.సాధారణంగా అథ్లెట్లు మెడల్ తీసుకునేటప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో మనోడు దానికి డబుల్ రచ్చ చేశాడు అని చెప్పుకోవచ్చు.కాగా ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరలవుతుంది.

అయితే, కోహ్లి సంబరాలు చేసుకోవడం చూసి.కెప్టెన్ రోహిత్ తన నవ్వు ఆపుకోలేక బిగ్గరగా నవ్వుతూ కనిపించాడు.

Telugu Australia, Gold Medal, Icc Odi Wc, Kohli, Mitchell Marsh, Latest, Viratko

ఇక, సూర్యకుమార్ యాదవ్ తన మొబైల్‌తో ఈ ప్రత్యేక క్షణాన్ని చిత్రీకరించాడు.మ్యాచ్ సెలబ్రేషన్ తర్వాత ఈ స్పెషల్ వీడియోని అభిమానులు చాలా ఇష్టపడుతున్నారు.ఇకపోతే ఈ మ్యాచులో కోహ్లీ, కేఎల్ రాహుల్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.ఒక దశలో భారత్ 2 పరుగులకే 3 వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడిన మ్యాచ్ కాస్త విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ రాకతో ఊపందుకుంది.

ఇక గతేడాది జరిగిన టి20 ప్రపంచకప్ లో పాకిస్తాన్ తో జరిగిన పోరులో భారత్ కు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు.ఇక మరోసారి కోహ్లీ టీమిండియా పాలిట దేవుడిలా నిలిచాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube