రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట కు చెందిన సమ్రీన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఏడవ తరగతి చదువుతున్న వికలాంగురాలు కు ట్రై బ్యాటరీ సైకిల్ అందించాలని మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ సమ్రేన్ ను ఆమె తల్లినీ సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్ లక్ష్మీరాజం ను కలిశారు.ప్రతి నెల ఆమెను పాఠశాలకు పంపించడానికి నెలకు వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుందని ఆమె మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ దృష్టికి తీసుకెళ్లారు.
వెంటనే సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్ లక్ష్మీరాజం ను కలవగా నాలుగు రోజుల లోపు సమ్రీన్ కు ట్రై బ్యాటరీ సైకిల్ అందిస్తానని ఆయన అన్నారు.ఎల్లారెడ్డిపేట లో గల డే కేర్ సెంటర్ లో ఉంటున్న వృద్దులకు నీవు అందిస్తున్న సేవలు అభినందనీయం అని జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్ లక్ష్మీరాజం అన్నారు.







