రాష్ట్రంలో కులవివక్షను వ్యతిరేకించేలా ఇటీవల కాలిఫోర్నియా( California ) చట్టసభ పంపిన బిల్లును ఆ రాష్ట్ర గవర్నర్ గావిన్ న్యూసోమ్( Governor Gavin Newsom ) ‘‘వీటో’’ చేశారు.ప్రస్తుత చట్టాలు ఇప్పటికే కులం సహా వివిధ కోణాల ఆధారంగా వివక్షను నిషేధిస్తున్నాయని గవర్నర్ తెలిపారు.
భారతీయ అమెరికన్ హిందూ సంఘాలు ఆయన నిర్ణయాన్ని స్వాగతించగా.కుల వ్యతిరేక, మైనారిటీ సంఘాలు మాత్రం విమర్శించాయి.
ఈ బిల్లు ఈ ఏడాది ఆగస్టులో కాలిఫోర్నియా హౌస్‌లో ఆమోదం పొందింది.ఆ సమయంలో భారతీయ అమెరికన్ సమాజంలోని కొన్ని సమూహాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.
అమెరికాలోని ఫ్రెస్నో, సీటెల్‌లు( Fresno , Seattle ) కుల ఆధారిత పక్షపాతాన్ని స్పష్టంగా నిషేధించిన తర్వాత కాలిఫోర్నియాలోనూ బిల్లు చట్టంగా మారుతుందని అంతా భావించారు.కానీ గవర్నర్ అనూహ్యంగా దానిని వీటో చేశారు.

‘‘ఎస్‌బీ 403’’ని కాలిఫోర్నియా రాష్ట్ర సెనేట్ సభ్యులకు తిరిగి పంపుతూ శనివారం గవర్నర్ న్యూసోమ్ ఆదేశాలు జారీ చేశారు.ఫెయిర్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ హౌసింగ్ యాక్ట్, అన్రూ యాక్ట్ అండ్ ఎడ్యుకేషన్ యాక్ట్‌ల ప్రయోజనాల కోసం వంశపారం పర్యతని ఈ బిల్లు నిర్వచించిందని గవర్నర్ పేర్కొన్నారు.కానీ కాలిఫోర్నియాలో.వారు ఎవరైనా , ఎక్కడి నుంచి వచ్చినా, ఎక్కడ నివసిస్తున్నా, ప్రతి ఒక్కరూ గౌరవంగా వ్యవహరించడానికి అర్హులని తాము విశ్వసిస్తున్నామని న్యూసోమ్ అన్నారు.అందుకే కాలిఫోర్నియా ఇప్పటికే లింగం, జాతి, రంగు, మతం, పూర్వీకులు, జాతీయ మూలం, వైకల్యం, ఇతర లక్షణాల ఆధారంగా వివక్షను నిషేధించిందని గవర్నర్ గుర్తుచేశారు.కులం ఆధారంగా వివక్ష చూపడం ఇప్పటికే వున్న పలు కేటగిరీల కింద నిషేధించబడినందున ఈ బిల్లు అనవసరమని న్యూసోమ్ అభిప్రాయపడ్డారు.
అందుచేత తాను ఈ బిల్లుపై సంతకం చేయలేనని ఆయన స్పష్టం చేశారు.ఈ ఏడాది ఆగస్టులో ‘‘ఎస్‌బీ 403’’ బిల్లును కాలిఫోర్నియా చట్టసభలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
ఇది రాష్ట్ర పౌర హక్కులు, విద్య, హౌసింగ్ కోడ్‌లలో వివక్ష వ్యతిరేక చర్య కోసం కులాన్ని స్పష్టమైన కేటగిరీగా చేర్చుతుంది.ఈ బిల్లుకు కాలిఫోర్నియా హౌస్ 50-3 తేడాతో ఆమోదం తెలిపింది.







