నందమూరి నటసింహం బాలకృష్ణ( Balakrishna ) ప్రజెంట్ నటిస్తున్న లేటెస్ట్ మోస్ట్ ఏవైటెడ్ మూవీ ”భగవంత్ కేసరి”.( Bhagavanth Kesari ) ఈ సినిమా తో బాలయ్య హ్యాట్రిక్ హిట్ అందుకోవాలని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు.
ఎందుకంటే ఈ సినిమా కంటే ముందు రెండు సినిమాలతో బాలయ్య వరుసగా హిట్స్ అందుకున్నాడు.అఖండ, వీరసింహారెడ్డి వంటి రెండు హిట్స్ ను తన ఖాతాలో వేసుకుని బాలయ్య మంచి ఊపు మీద ఉన్నాడు.

ఇక ఇప్పుడు దసరా బరిలో మరో సినిమాతో రాబోతున్నాడు.బాలయ్య మంచి ఫామ్ లో ఉండడంతో భగవంత్ కేసరి సినిమాపై ముందు నుండి అంచనాలు బాగా పెరిగాయి.బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి( Anil Ravipudi ) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.తాజాగా మేకర్స్ భారీ స్థాయిలో ట్రైలర్ ఈవెంట్ చేసారు.
ఈ ట్రైలర్ ను నిన్న రాత్రి ఘనంగా నిర్వహించగా ఈ ఈవెంట్ లో బాలయ్యతో పాటు టీమ్ అంతా పాల్గొన్నారు.మరి ఈ ట్రైలర్ అద్భుతంగా ఆకట్టుకుని టాప్ లో ట్రెండ్ అవుతుంది.
వరంగల్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించగా ఈ ఈవెంట్ లో రచ్చ రవి కూడా పాల్గొని బాలయ్యపై చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఇంతకీ రచ్చ రవి ఏం మాట్లాడాడంటే…

రచ్చ రవి ( Racha Ravi )మాట్లాడుతూ.వరంగల్ లో ఉన్న కూడా ఏనాడూ రాజునూ చూడలేదు.రాజు అంటే రాజ్యం.
బలగం ఉండడం కాదు.రాజు అంటే ప్రజలందరికి దైర్యం ఇచ్చే వాడు.
అలా మన ఇండస్ట్రీకి, దర్శక నిర్మాతలకు, డిస్టిబ్యూటర్స్ కు మా బాలయ్య ధైర్యాన్ని ఇస్తాడు.కృష్ణుడిలా ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు.
కొట్టాడు.తిట్టాడు అని అంటారు.
కానీ ఎందుకు కొట్టాడు.ఎందుకు తిట్టాడు.
అనేది ఆయనకు అవతలి వారికీ తెలుస్తుంది.బాలయ్యే మా దేవుడు.
అంటూ రచ్చ రవి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.







