భార్య పరాయి వ్యక్తితో లేచిపోతే.. ఫ్రెండ్స్ కు పార్టీ ఇచ్చి పండగ చేసుకున్న భర్త..!

సాధారణంగా భార్య లేదా భర్త పరాయి వ్యక్తులతో లేచిపోతే కొందరు చాలా అవమానకరంగా ఫీల్ అవుతారు.తమ పరువు పోయిందని నలుగురిలో దర్జాగా తిరగలేరు.

 Wife Eloped With Lover Her Husband Celebrate It With 250 People In Kerala Detail-TeluguStop.com

కానీ ఓ వ్యక్తి తన భార్య పరాయి వ్యక్తితో లేచిపోయింది అని బాధపడకుండా ఏకంగా 250 మందికి ఆల్కహాల్ పార్టీ ఇచ్చి అందరిని ఆశ్చర్యపరచిన ఘటన కేరళలోని( Kerala ) కోజికోడ్ లో చోటుచేసుకుంది.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.

ఈ వీడియో చూసిన నెటిజన్స్ హాస్యస్పదంగా పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు.

ఈ వీడియోను ఒకసారి గమనిస్తే.

కోజికొడ్ లోని( Kozhikode ) వడకారా లో ఈ ఘటన జరిగింది.ఆ బాధిత భర్త తన స్నేహితులతో కలిసి మద్యం తాగుతూ డాన్స్ చేశాడు.

ఓ ఇంటి ఆవరణలో జరిగిన ఈ పార్టీలో మోహన్ లాల్ సినిమాలోని నరన్ లో ఉండే పాటకు డాన్స్ చేస్తూ హంగామా చేశారు.

అయితే నిజంగా భార్య లేచిపోయినందుకు( Wife Eloped ) ఆ వ్యక్తి పార్టీ ఇస్తున్నాడా.ఇందులో వాస్తవం ఉందా అనేది క్లారిటీగా తెలియదు.సోషల్ మీడియాలో చేరిన ఈ వీడియో యొక్క క్యాప్షన్ మాత్రం భార్య లేచిపోయింది.

భర్త 250 మందికి మద్యం, ఆహారం పెట్టి పండగ చేసుకున్నాడు అని ఉంది.ఈ వీడియోను ఎవరు రికార్డు చేశారో అనే వివరాలు కూడా లేవు.

కానీ ఈ వీడియో అక్టోబర్ 6న ఫేస్బుక్ లో అప్లోడ్ అయింది.ఇప్పటివరకు 8.5 లక్షల మందికి పైగా ఈ వీడియోను చూశారు.ఈ వీడియో చూసిన లో కొంతమంది విడాకులు ఇవ్వొచ్చుగా అని కామెంట్స్ చేస్తున్నారు.

మరి కొందరేమో దేశంలో చాలామంది ఇలానే పార్టీ( Party ) చేసుకోవాలి అని అంటున్నారు.మరికొందరు భార్య లేచిపోతే బాధపడకుండా ఇలాగే సంతోషంగా గడపాలని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube