ఢిల్లీ వార్ రూమ్ వద్ద ఆందోళన కార్యక్రమం నిర్వహించిన ఓయూ జేఏసీ నేతలతో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జితేందర్ సింగ్ మాట్లాడారు.ఈ మేరకు వార్ రూమ్ ఎదుట బైఠాయించిన ఓయూ జేఏసీతో చర్చలు జరిపారు.
ఈ నేపథ్యంలో అందరికీ న్యాయం చేస్తామని జితేందర్ సింగ్ హామీ ఇచ్చారు.అదేవిధంగా ఉదయ్ పూర్ డిక్లరేషన్ ను జాతీయ స్థాయిలో అమలు చేస్తున్నామని తెలిపారు.
ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలోనూ ఈ డిక్లరేషన్ అమలు అవుతుందని ఓయూ జేఏసీ నేతలకు ఆయన హామీ ఇచ్చారు.కాగా రాహుల్ గాంధీ గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలంటూ ఓయూ జేఏసీ నేతలు ఆందోళన కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే.







