నల్లగొండ జిల్లా:తెలంగాణ రాష్ట్రంలోని బీసీ గురుకుల విద్యార్థులకు కేసీఆర్ సర్కార్( CM KCR ) మరో శుభవార్త చెప్పింది.బీసీ గురుకులాల్లో దసరా తర్వాత చేపల కూర పెట్టేందుకు నిర్ణయం తీసుకుంది.
దసరా తర్వాత బీసీ గురుకులాల్లోని విద్యార్థులకు భోజనంలో చేపల కూర అందించాలని ఫిష్ ఫెడరేషన్ నిర్ణయించింది.ప్రస్తుతానికి ఈ పథకాన్ని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో( Karimnagar ) పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టనున్నట్లు ఫెడరేషన్ చైర్మన్ రవీందర్( Ravinder ) తెలిపారు.
ఒక్కో విద్యార్థికి 150 గ్రాములు చొప్పున ప్రతి బుధవారం 15వేల మందికి చేపల కూర అందిస్తామన్నారు.ఈ మేరకు స్కూళ్లలోని వంట మనుషులకు ఒక రోజు శిక్షణ ఇవ్వనున్నారు.