టీడీపీపై మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.స్కిల్ డెవలప్ మెంట్ నిధులు దారి మళ్లాయని టీడీపీ అబద్దాలు మాట్లాడుతోందని మండిపడ్డారు.
టీడీపీకి కాంతి లేకుండా చేస్తామని మంత్రి కాకాణి అన్నారు.సీఐడీ అధికారుల దర్యాప్తులో టీడీపీ అధినేత చంద్రబాబు అవినీతికి పాల్పడ్డట్లు తేలిందని పేర్కొన్నారు.
ఈ క్రమంలో చంద్రబాబు కోర్టులో తన నిజాయితీ నిరూపించుకోవాలని సూచించారు.రాష్ట్రంలో వ్యవస్థలు బాగానే ఉన్నాయన్న మంత్రి కాకాణి టీడీపీ నేత సోమిరెడ్డి తనపై రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయారని చెప్పారు.
ఈసారైనా సోమిరెడ్డి పోటీ చేసి డిపాజిట్ తెచ్చుకోవాలని సూచించారు.