2019 చివరిలో చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి( Corona Virus ) ప్రపంచాన్ని ఎంతగా ఉక్కిరిబిక్కిరి చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.గడిచిన నాలుగేళ్ల కాలంలో కోట్లాది మంది ప్రజలు దీని బారినపడగా .
లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు.కంటికి కనిపించని ఓ సూక్ష్మజీవి తనకంటే ఎన్నో రెట్లు శక్తివంతుడైన మనిషిని నాలుగు గోడల మధ్య బందీని చేసింది.
నలుగురిలోకి వెళ్లాలంటే భయం.తోటి వ్యక్తి తుమ్మితే టెన్షన్.ఆర్ధిక వ్యవస్ధ చిన్నాభిన్నం కాగా.లక్షలాది మంది రోడ్డునపడ్డారు.ఇలా ఒకటి కాదు.రెండు కాదు ఈ మహమ్మారి వల్ల ఎన్నో దారుణాలు.
అయితే వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో కోవిడ్ తీవ్రత తగ్గింది.అయినప్పటికీ కొత్త కొత్త వేరియంట్లు మానవాళిపై దాడి చేస్తూనే వున్నాయి.
శాస్త్రవేత్తలు సైతం కరోనా ముప్పు ఇంకా తప్పిపోలేదని హెచ్చరిస్తూనే వున్నారు.
తాజాగా సింగపూర్( Singapore )లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.రాబోయే వారాల్లో దేశంలో భారీగా కేసులు నమోదై, ప్రజలు ఆసుపత్రిలో చేరే అవకాశం వుందని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి ఓంగ్ యే కుంగ్ శుక్రవారం హెచ్చరించారు.గత మూడు వారాల నుంచి రోజువారీ కేసుల సంఖ్య 1000 నుంచి 2000కు చేరినట్లు ఓంగ్ తెలిపారు.
ప్రభుత్వం ఈ పరిస్ధితిని ‘‘ఎండమిక్ డిసీజ్’’గా పరిగణిస్తుందన్నారు.ఈజీ.5 దాని ఉపరకం హెచ్‌కే.3 వేరియంట్‌ల కారణంగానే దేశంలో కేసులు పెరుగుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు.ఇవి రెండూ ఎక్స్‌బీబీ ఓమిక్రాన్ వేరియంట్( XBB Omicron Variant ) రకాలే.
అయితే దేశంలో లాక్‌డౌన్, కరోనా ఆంక్షలు విధిస్తారా అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు మంత్రి స్పందించారు.మార్చి నుంచి ఏప్రిల్ వరకు సంభవించిన చివరి వేవ్ మాదిరిగా ఎలాంటి ఆంక్షలు విధించే ఉద్దేశం లేదని ఓంగ్ స్పష్టం చేశారు.ఈ ఏడాది ఏప్రిల్‌లో గరిష్ట స్థాయిలో రోజుకు 4000 కేసులు నమోదయ్యాయి.
ప్రస్తుతం కరోనాను స్థానిక వ్యాధిగానే పరిగణిస్తామని.ఇది మా వ్యూహానికి అనుగుణంగానే వుంటుందని, దానితోనే జీవిస్తున్నామని ఓంగ్ తెలిపారు.
మునపటి వేరియంట్‌లతో పోలిస్తే.కొత్త వేరియంట్‌లు తీవ్రమైన అనారోగ్యాలు కలిగించవని ఆయన పేర్కొన్నారు.
కొత్త వేరియంట్ల నుంచి ప్రజలను రక్షించడంలో వ్యాక్సిన్లు ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని ఆరోగ్య మంత్రి తెలిపారు.