ఏపీలో ఎన్నికలకు ఇంకా ఎనిమిది నెలలు సమయం ఉన్నప్పటికి రాజకీయాలు ఏ స్థాయిలో కాకమీద ఉన్నాయో అందరికీ తెలిసిందే.వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం టీడీపీ గట్టిగా ప్రయత్నిస్తోంది.
అందుకే జనసేనతో కూడా చేతులు కలిపింది.అటు వైసీపీ మరోసారి అధికారంలోకి మరోసారి అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతోంది.
ఈ నేపథ్యంలో రెండు ప్రధాన పార్టీల మద్య చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి.ఇప్పటికే టీడీపీ అధినేతను జైల్లో ఉంచి ఆ పార్టీని గట్టిగా దెబ్బ తీశారు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి.

ఇక తాము అధికారంలోకి వస్తే దెబ్బకు దెబ్బ తీస్తామని టీడీపీ నేతలు ఇప్పటి నుంచే సవాళ్ళు విసురుతున్నారు.కాగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత విమర్శల వేడి మరింత పెరిగిందనే చెప్పాలి.రాజకీయ విమర్శలు కాస్త వ్యక్తిగత విమర్శలుగా మారి చాలా సందర్భాల్లో ప్రజల్లో చర్చనీయాంశం అవుతున్నాయి కూడా.ముఖ్యంగా కొడాలి నాని, పెర్ని నాని, ఆర్కే రోజా వంటి వారు చంద్రబాబు నాయుడుపై, నారా లోకేశ్ ( Nara Lokesh )పై చేసే విమర్శలు తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటాయి.
ఇదిలా ఉంచితే వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి( Balineni Srinivasa Reddy ) తన పార్టీ నేతలకు చేసిన సూచనలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి.

తాము అధికారంలోకి వస్తే వైసీపీ వాళ్ళ తాట తీస్తామని చెబుతున్నారని, ఒకవేళ నిజంగానే వల్లే అధికారంలోకి వస్తే మన పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.దీంతో వైసీపీ గెలుపుపై సొంత పార్టీ నేతలలోనే సందేహాలు ఉన్నాయా ? అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.గత కొన్నాళ్లుగా బాలినేని శ్రీనివాస్ పార్టీ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు.
దాంతో ఆయన పార్టీ మారే అవకాశం ఉందని కూడా వార్తలు వచ్చాయి.కానీ జగన్ జోక్యంతో సైలెంట్ అయ్యారయన.
ఇక తాజాగా పై విధంగా వ్యాఖ్యలు చేయడం కొంత చర్చనీయాంశంగా మారింది.టీడీపీ గెలిస్తే వైసీపీ( TDP )లోని కొందరి నేతల పనైపోతుందని బాలినేని పరోక్షంగా అన్నట్లు తెలుస్తోంది.
మరి బాలినేని వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.






