కామారెడ్డి జిల్లాలోని అధికార పార్టీ బీఆర్ఎస్ లో ఫ్లెక్సీల వివాదం రాజుకుంది.మంత్రి కేటీఆర్ కు స్వాగతం చెబుతూ కామారెడ్డిలో పార్టీ శ్రేణులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
అయితే సదరు ఫ్లెక్సీల్లో స్థానిక ఎమ్మెల్యే ఫొటో లేకపోవడంపై అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే పార్టీకి చెందిన ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగిందని తెలుస్తోంది.
అది కాస్తా ముదరడంతో కామారెడ్డిలో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.







