దేశంలో ఎంతో ప్రతిభ ఉన్నా లక్షల సంఖ్యలో విద్యార్థులు సక్సెస్ సాధించకపోవడానికి ఆర్థిక సమస్యలు కారణమనే సంగతి తెలిసిందే.అయితే కొంతమంది మాత్రం ఎన్ని ఆర్థిక సమస్యలు ఉన్నా పరీక్షల్లో సత్తా చాటుతూ ప్రశంసలను అందుకుంటున్నారు.
తాజాగా విడుదలైన కానిస్టేబుల్ ఫలితాల్లో ఒకే ఇంట్లో ఇద్దరు ఉద్యోగం సాధించడం గమనార్హం.నర్సంపేట మండలం కమ్మపల్లికి చెందిన అన్నాచెల్లెళ్లు చిలువేరు శ్రీకాంత్, వినిత వేర్వేరుగా కానిస్టేబుల్ జాబ్( Constable Jobs ) కు ఎంపికై ప్రశంసలు అందుకుంటున్నారు.2021 సంవత్సరంలో డిగ్రీ పూర్తి చేసిన శ్రీకాంత్ ప్రముఖ ప్రైవేట్ సంస్థలో జాబ్ చేస్తున్నారు.వినిత( Vinitha ) తెలంగాణ సాంఘిక సంక్షేమ వసతి గృహంలో ఈ ఏడాదే డిగ్రీ పూర్తి చేశారు.
శ్రీకాంత్, వినిత కుటుంబం విషయానికి వస్తే శ్రీకాంత్ తండ్రి రవి తాపీమేస్త్రిగా పని చేస్తుండగా తల్లి రమ కూలి పనులకు వెళుతున్నారు.హనుమకొండలో శ్రీకాంత్, వినిత ఒకే దగ్గర ఉండి పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యారు.

పరీక్షలకు అవసరమైన పుస్తకాలను కొనుగోలు చేసి సెల్ఫ్ ప్రిపరేషన్ తో పరీక్షల్లో సత్తా చాటారు.శ్రీకాంత్( Srikanth ) జైళ్ల శాఖలో కానిస్టేబుల్ గా ఉద్యోగం సాధించగా, వినిత సివిల్ కానిస్టేబుల్ గా ఉద్యోగం సాధించారు.ఎంతో కష్టపడి చదివి లక్ష్యాన్ని సాధించిన శ్రీకాంత్, వినిత సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తుందని చెప్పవచ్చు.శ్రీకాంత్, వినిత కుటుంబానికి ఎలాంటి వ్యవసాయ భూమి లేదని తెలుస్తోంది.

వీరి కుటుంబంలో ఇప్పటివరకు ఎవరూ ప్రభుత్వ ఉద్యోగం సాధించలేదని సమాచారం.శ్రీకాంత్, వినిత రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా ఉన్నత స్థితికి చేరుకోవాలని శ్రేయోభిలాషులు ఆకాంక్షిస్తున్నారు.ఒకే సమయంలో అన్న, చెల్లి ఉద్యోగం సాధించడంతో కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.శ్రీకాంత్, వినిత టాలెంట్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.







