కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయిన సీఎం జగన్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్( Ys jagan ) ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే.గురువారం ఉదయం ఢిల్లీ వెళ్లిన సీఎం జగన్.

 Cm Jagan Met Union Home Minister Amit Shah , Delhi, Cm Jagan, Union Home Ministe-TeluguStop.com

అక్కడ పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కావడం జరిగింది.ఈరోజు ఉదయం విజ్ఞాన్ భవన్ ( Vigyan Bhavan )లో వామపక్ష తీవ్రవాదం నిర్మూలన సదస్సులో పాల్గొన్నారు.

ఈ సదస్సులో సీఎం జగన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత నాలుగు దశాబ్దాలుగా వామపక్ష తీవ్రవాద సమస్యపై పోరాడుతున్నట్లు తెలిపారు.ఈ క్రమంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సహాయం ద్వారా తీవ్రవాద సమస్యను సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు.

ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కల రాష్ట్రాలతో పటిష్టమైన సమన్వయం ఉంది.

అనంతరం ఈరోజు సాయంత్రం కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో( Union Home Minister Amit Shah ) సీఎం జగన్ భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించారు.అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పెండింగ్ అంశాలపై కూడా చర్చ జరిపినట్లు సమాచారం.అంతేకాకుండా ఈ  భేటిలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టు అంశాలపై చర్చ కూడా జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.కాగా శుక్రవారం రాత్రి తిరిగి ఢిల్లీ నుండి ఏపీకి సీఎం జగన్ బయలుదేరనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube