జీ మెయిల్ అకౌంట్ కు( GMail ) స్పామ్ ఈ-మెయిల్స్ తెగ ఇబ్బంది పెడుతున్న సంగతి తెలిసిందే.ఎప్పుడు జీ మెయిల్ ఓపెన్ చేసిన ఇన్ బాక్స్ లో అనవసరమైన మెయిల్స్ వచ్చి చేరుతుంటాయి.
ఒకవేళ పొరపాటున అందులోని స్పామ్ మెయిల్స్ ను( Spam EMails ) గెలికితే చిక్కుల్లో పడ్డట్టే.అనవసర మెయిల్స్ ను ఓపెన్ చేయకుండానే డిలీట్ చేయడం ఉత్తమం.
అలాకాకుండా ఆ మెయిల్స్ లో ఏముందో అని తెరిచి చూస్తే అనవసరంగా సైబర్ నేరగాళ్ల వలలో చిక్కినట్టే అని సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
అయితే మన జీ మెయిల్ కు వచ్చిన ఈ-మెయిల్స్ స్పామ్ మెయిల్స్ ఆ, కాదా అని తెలుసుకునే ప్రయత్నంలో సైబర్ నేరగాళ్ల బారిన పడ్డ వారి సంఖ్య కాస్త ఎక్కువగానే ఉంది.
అయితే ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు గూగుల్( Google ) ఓ సరికొత్త ఫీచర్ ను పరిచయం చేయనుంది.ఈ సరికొత్త ఫీచర్ తో స్పామ్ మెయిల్స్ కు అడ్డుకట్ట పడినట్టే.

ఇకపై ఒక రోజుకు ఐదు వేల కంటే ఎక్కువ మెసేజ్ లు పంపే బల్క్ ఈ-మెయిల్స్ ఇప్పుడు అథెంటిఫికేషన్( Authentification ) చేయాల్సి ఉంటుంది.ఇలా చేస్తే మెయిల్స్ ఉపయోగించే వారికి సైబర్ ముప్పు తప్పుతుంది.మాండేటరీ అథెంటిఫికేషన్ ద్వారా హానికరమైన ఈమెయిల్స్ ను 70 శాతం తగ్గించవచ్చని గూగుల్ తెలిపింది.

బల్క్ మెయిల్స్ పంపినవారు ప్రతి ఇమెయిల్ లో అన్ సబ్స్క్రైబ్ బటన్ చేర్చాల్సి ఉంటుంది.ఈ బటన్ తో సదరు స్పాం మెయిల్స్ ను కేవలం ఒక క్లిక్ తో అన్ సబ్స్క్రైబ్ చేసెయ్యొచ్చు.గూగుల్ అదనంగా క్లియర్ స్పామ్ రేట్ థ్రెషోల్డ్’ని కూడా అందుబాటులోకి తెచ్చింది.
ఈ సరికొత్త ఫీచర్ తో స్పామ్ మెయిల్స్ చాలా వరకు తగ్గే అవకాశం ఉందని గూగుల్ పేర్కొంది.







