హన్మకొండ జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.విపక్షాల మాటలు విని మోసపోవద్దని సూచించారు.
ఉద్యమానికి ఊపిరిగా నిలిచిన గడ్డ వరంగల్ అని మంత్రి కేటీఆర్ అన్నారు.తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్, బీజేపీ లేవని పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కావాలనే తెలంగాణపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు.తెలంగాణ పోరాటాన్ని సైతం ప్రధాని మోదీ కించపరిచారని తెలిపారు.
కాంగ్రెస్ నేతలు మాయమాటలు చెబుతున్నారన్నారు.ఈ క్రమంలోనే బీజేపీ, కాంగ్రెస్ నేతలకు బంపర్ ఆఫర్ ఇస్తున్నామన్న కేటీఆర్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కడికి వెళ్తారో వెళ్లండి.
కరెంట్ వస్తుందో లేదో కరెంట్ వైర్లు పట్టుకుని చూడండని వెల్లడించారు.రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం బీఆర్ఎస్ సర్కార్ అని తెలిపారు.







