కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ జోసెఫ్( Hero Thalapathy Vijay ) సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ‘లియో’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఈ కాంబో ఇంతకు ముందు కూడా వచ్చి బ్లాక్ బస్టర్ కావడంతో ఈ సినిమాపై ఆడియెన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు.
విజయ్ ఈసారి దసరా బరిలో ”లియో” సినిమాతో రాబోతున్నాడు.

దీంతో ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేసి సినిమాపై మరిన్ని హోప్స్ పెంచేస్తున్నారు.”లియో” సినిమా లో స్టార్ హీరోయిన్ త్రిష( Heroine Trisha ) విజయ్ కు జోడీగా నటిస్తుంది.సెవన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.
ఈ సినిమాను అక్టోబర్ 19న దసరా కానుకగా రిలీజ్ చేస్తున్నారు.
దీంతో ఆడియెన్స్ అంత ఎంతో ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు.
ఇక నిన్నటికి నిన్న మేకర్స్ ఈ మూవీ ట్రైలర్ రిలీజ్( Leo Trailer Release ) చేసి సర్ప్రైజ్ ఇచ్చారు.ఈ ట్రైలర్ రిలీజ్ తో రికార్డులు బద్దలవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.
ముందు నుండి ఈ సినిమా రిలీజ్ ను అంతటా భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్న విషయం విదితమే.పాన్ ఇండియా వ్యాప్తంగానే కాకుండా ఓవర్సీస్ లో కూడా గ్రాండ్ రిలీజ్ కు ప్లాన్ చేసారు.

ఇక తాజాగా ఒక్క హిందీ రిలీజ్ లోనే సరికొత్త రికార్డు క్రియేట్ చేయబోతుంది అని తెలుస్తుంది.నార్త్ మార్కెట్ లో ఈ సినిమా మల్టీ ఫ్లెక్స్ చైన్ స్క్రీన్ లలో రిలీజ్ కాకపోయినా సింగిల్ స్క్రీన్స్( Single Screens ) లో మాత్రం భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారట.తాజాగా నిర్మాత ఒక్క హిందీలోనే సింగిల్ స్క్రీన్ లలో 2000 కి పైగానే లియో సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.ఇది బిగ్గెస్ట్ రిలీజ్ అనే చెప్పాలి.
చూడాలి ఓపెనింగ్స్ ఏ స్థాయిలో వస్తాయో.







