“కట్టప్ప”ప్రస్తుతం ఈ పేరు తెలియని సినీ ప్రియులు ఉండరని చెప్పడంలో అతిశయోక్తి లేదు.కదానికి ప్రధాన కారణం బాహుబలి ( Bahubali ) సినిమా లో ప్రభాస్, రానా, అనుష్క ఎంత అయితే ఫేమస్ అయ్యారో వీరితో సమానంగా ఫేమస్ అయ్యారు కట్టప్ప పాత్రలో నటించిన సత్యరాజ్ ప్రస్తుతం ఈయనకు సినిమా ఇండస్ట్రీలో మంచి డిమాండ్ ఉంది.
ఈయన ఒక రోజుకి 15 లక్షల రెమ్యూనరేషన్ తీసుకుంటూ బిజీయెస్ట్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.మరి అలాంటి సత్య రాజ్ ఒకానొక సమయంలో ఓ స్టార్ హీరో తండ్రి కాళ్లు పట్టుకొని ఒక్క ఛాన్స్ ఇవ్వండి ప్లీజ్ అంటూ బతిమిలాడారంట.
మరి ఇంతకీ ఆ స్టార్ హీరో తండ్రి ఎవరు.కాళ్లు పట్టుకునే స్టేజ్ వరకు సత్యరాజ్ ( Sathyaraj ) ఎందుకు వెళ్లారు.
అనే సంగతి ఇప్పుడు తెలుసుకుందాం.

ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చిన్న చిన్న పాత్రలు అలాగే విలన్ గా తన సినీ కెరీర్ ని మొదలుపెట్టారు సత్యరాజ్.ఆ తర్వాత ఈయన ఉన్న హైట్ కి హీరో అవకాశాలు కూడా బాగానే వచ్చాయి.అలా విభిన్న పాత్రలు పోషిస్తూ ఇండస్ట్రీలో ముందుకు వెళ్లారు.
అయితే ఈయనకు ఇండస్ట్రీలో స్టార్డం రావడానికి కారణం సూర్య ( Surya ) తండ్రి శివకుమార్ అని ఇప్పటికే ఎన్నో ఇంటర్వ్యూలలో సత్యరాజ్ చెప్పుకోచ్చారు.అయితే అప్పట్లో శివకుమార్ మంచి స్టార్ నటుడు.

ఈయన చెబితే ఏదైనా జరుగుతుంది అనే విధంగా ఉండేది.అయితే అలాంటి సమయంలో సత్యరాజ్ శివకుమార్ ( Siva kumar ) దగ్గరికి వెళ్లి నాకు ఆ సినిమాలో అవకాశం ఇప్పించండి ప్లీజ్ అంటూ కాళ్లు పట్టుకొని బతిమిలాడారట.ఇక శివకుమార్ దగ్గరికి వచ్చి సత్యరాజ్ అలా చేసేసరికి తనకు సినిమాల్లో అవకాశం ఇప్పించారట.ఇక ఇప్పటికి కూడా తనకు సినీ కెరియర్ ఉంది అంటే దానికి కారణం శివకుమార్ అంటూ చాలా భావోద్వేగంతో చెప్పుకుంటారు సత్యరాజ్.
అంతేకాదు శివకుమార్ లేకపోతే తన సినీ కెరియర్లో ఇంత సక్సెస్ అయ్యే వాడిని కాదు అని, నా సినిమా కెరియర్ గురించి చెప్పుకోవాలంటే ముందుగా శివకుమార్ పేరు చెప్పుకుంటాను అంటూ ఇప్పటికే చాలా ఇంటర్వ్యూలలో సత్యరాజ్ చెప్పిన సందర్భాలు ఉన్నాయి.అలా అప్పటి నుండి ఇప్పటివరకు సూర్య తండ్రి శివకుమార్ తో సత్యరాజ్ ఫ్యామిలీ కి మంచి అనుబంధం ఉంది.







