సూర్యాపేట జిల్లా: నేరేడుచర్ల పట్టణంలోని ప్రధాన రహదారిపై సాగర్ నీటిని విడుదల చేయాలని బీజేపీ కిసాన్ మోర్చ ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు.రంగ ప్రవేశం చేసిన పోలీసులు బీజేపీ నాయకులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.
ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ అక్టోబర్ ఒకటి లోగా ఒక తడి సాగర్ నీటిని విడుదల చేయిస్తానని మాటిచ్చిన ఎమ్మెల్యే మాట తప్పాడని విమర్శించారు.సాగర్ నీరు లేక,కరెంట్ సక్రమంగా రాక పొట్టదశకు వచ్చిన పంట పొలాలు ఎండిపోతుంటే దిక్కుతోచని స్థితిలో పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులకు 24 గంటలు ఉచిత కరెంట్ ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు.
ఇప్పటికైనా 24 గంటల కరెంట్ ఇచ్చి,సాగర్ నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ,మండల అద్యక్షులు సంకలమద్ది సత్యనారాయణరెడ్డి,పార్తనబోయిన విజయ్ కుమార్,స్టేట్ కౌన్సిల్ మెంబర్ బాలవెంకటేశ్వర్లు, కిసాన్ మోర్చా అధ్యక్షులు తాళ్ల నరేందర్ రెడ్డి, పి.సత్యం,పాలకవీడు మండల అధ్యక్షులు గుండ్రెడ్డి విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.