మెట్ట పైర్ల సాగులో అధిక దిగుబడి కోసం మెళుకువలు..!

వ్యవసాయ రంగం( Agriculture )లో చాలావరకు నీటి వసతి ఉన్న నేలలకంటే.నీటి వసతి లేని నేలలే ఎక్కువ.

 Techniques For High Yield In The Cultivation Of Metta Sagu, Black Soil , Agric-TeluguStop.com

కాబట్టి చాలా వరకు వ్యవసాయం వర్షాధారంగానే జరుగుతోంది.అయితే సకాలంలో వర్షం పడకపోవడం, తక్కువ వర్షపాతం కారణంగా పంట దిగుబడిలో చాలా వ్యత్యాసం కనిపిస్తుంది.

మరి రైతులు తక్కువ దిగుబడి వస్తే తీవ్ర నష్టాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.అలాకాకుండా మెట్ట సాగులో భూ సంరక్షణ, ఆధునిక మెట్ట వ్యవసాయ సాగు పద్ధతులను అనుసరించడం వల్ల అధిక దిగుబడులను సాధించవచ్చు.

ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకుందాం.

నల్ల రేగడి( Black soil ) నేలలు వర్షాలు తక్కువగా ఉన్నా కూడా తేమను కాస్త నిల్వ ఉంచుకోగలుగుతాయి కానీ ఎర్ర నేలలు లోతు తక్కువ కావడం వల్ల నీటిని,తేమను నిల్వ ఉంచుకునే సామర్థ్యం చాలా తక్కువ.మరి ఎర్ర నేలలలో తక్కువ సమయంలో అధిక వర్షం( Heavy rain ) కురిసింది అంటే భూమిపై ఉండే సారవంతమైన పైపొర మట్టి, అందులోని పోషక పదార్థాలు నష్టపోవడం జరుగుతుంది.

ఇలా జరగకుండా ఉండేందుకు కాంటూరు గట్లు, జీవగ్ల తో వాలుకు అడ్డంగా సేద్యం చేయాలి.ఇలా వాలుకు అడ్డంగా దుక్కి దున్ని, విత్తనం నాటి అంతర కృషి చేయడం వల్ల నీటి ఒరవడిని ఎక్కడికక్కడే అరికట్టి ఎక్కువ నీటిని భూమిలోకి ఇంకింప చేయవచ్చు.పొలంలో కాలువలతో పాటు బోదెలను ఏర్పాటు చేయాలి.

ఇలా చేస్తే తక్కువ వర్షపాతం నమోదైన నేల తేమను కలిగి ఉండడంతో పంట మొక్కలు బెట్టకు గురికావు.పొలంలో ప్రతి 50 మీటర్ల దూరానికి 0.63 ఘనపు మీటర్ల పరిమాణంలో కాంటూరు గట్లు వెయ్యాలి.ఒకవేళ నేలపైపుర గట్టి పడే భూములు ఉంటే.

ఒక ఎకరాకు 15 టన్నుల ఇసుకను కలిపి పొలాన్ని కలియదున్నాలి.ఈ పద్ధతులను పాటిస్తే వర్షపు నీరు బాగా భూమిలోకి ఇంకి నీటి వృధా తగ్గుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube