మన పక్క రాష్ట్రమైనటువంటి కర్ణాటకలో(Karnataka) కాంగ్రెస్ అత్యధిక మెజారిటీతో గెలుపొంది ప్రభుత్వాన్ని నెలకొల్పింది.అక్కడ కాంగ్రెస్ ఎప్పుడైతే గెలిచిందో తెలంగాణలో కూడా కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ పెరిగింది.
కర్ణాటక ఫలితం ఇక్కడ కూడా రిపీట్ అవుతుందని చెప్పుకుంటూ ఇక్కడి నాయకులు ముందుకు వెళ్తున్నారు.ఇదే తరుణంలో కర్ణాటకలోని పరిస్థితులు చాలా దారుణంగా మారాయని అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కే షడాక్షరి( MLA K Shadakshari) అన్నారు.
అయితే కాంగ్రెస్ పార్టీ అక్కడ ఐదు గ్యారంటీలు ఇచ్చి వాటి అమలు చేయడం కోసం అనేక కష్టాలు పడుతుందట.ఆ ఇచ్చిన ఐదు గ్యారంటీలు తప్ప, ఏ పనులు కూడా కావడం లేదని సొంత పార్టీ నేతలే బాధపడుతున్నారని అన్నారు.
ఆ పథకాల వల్ల మేము అబద్దాల నాయకుల మయ్యమని, ప్రజల ముందుకు వెళ్లాలంటేనే భయంగా ఉందని అన్నారు.ఈ పథకాలకు తప్ప ఇతర ఏ అభివృద్ధి పనులకు నిధులు లేక నిస్సహాయక స్థితిలో ఉన్నామని షడాక్షరి తెలియజేశారు.

కర్ణాటకలో కాంగ్రెస్(Congress)పార్టీ ఎన్నికలకు ముందు ఈ ఐదు గ్యారంటీల పథకాలను ప్రవేశపెట్టింది.ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది గృహలక్ష్మి ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి 2 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తానని చెప్పింది.అలాగే గృహలక్ష్మి( Gruhalakshmi ) ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబంలో మహిళ పెద్ద కు రూ:2,000 అందించడం.అన్న భాగ్య పథకం ద్వారా ప్రతి వ్యక్తికి నెలకు 10 కిలోల ఉచిత బియ్యం , యువ నిధి పథకం ద్వారా డిగ్రీ పాసైన యువతకు నెలకు 3000 రూపాయల భృతి.
శక్తి పథకం( Shakthi Scheme ) ద్వారా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం.ఈ విధంగా ఐదు పథకాలు అమలు చేస్తూ వస్తోంది కర్ణాటక ప్రభుత్వం.

ఈ పథకాలు అమలు కోసం విపరీతంగా బడ్జెట్ అవసరమవుతుందట.దీనివల్ల ఈ పథకాలు తప్ప ఇతర అభివృద్ధి పనులకు కూడా బడ్జెట్ లేక అధికార పార్టీ నాయకులు అనేక ఇబ్బందులు పడుతున్నారని కుండ బద్దలు కొట్టారు ఎమ్మెల్యే షడాక్షరి(MLA K Shadakshari).కర్ణాటక ప్రభుత్వం ఏర్పడి కేవలం మూడు నెలలు అవుతుంది.ఇప్పుడే ఇన్ని ఇబ్బందులు ఎదురైతే ముందు ముందు ఏ విధంగా పథకాలు అమలు చేస్తారని ప్రజలు అనుకుంటున్నారు.
అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రాబోవు ఎన్నికల్లో గెలిస్తే, 6 గ్యారంటీని ఇస్తామని అంటుంది.ఇప్పటికే రాష్ట్ర అప్పు లక్షల కోట్లకు పైగా ఉంది.ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈ పథకాలను ఎలా అమలు చేస్తుందని తెలంగాణ ప్రజలు ఆలోచిస్తున్నారు.







