బీసీసీఐ పై క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్..ప్రారంభ వేడుకలు లేకుండానే వరల్డ్ కప్ ఆరంభం..!

భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్ టోర్నీ( ODI World Cup Tournament ) ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అహ్మదాబాద్( Ahmedabad ) లోని నరేంద్ర మోడీ మైదానం వేదికగా మరి కాసేపట్లో ఎటువంటి ప్రారంభ వేడుకలు లేకుండా ఆరంభం అవుతూ ఉండడంతో బీసీసీఐ పై క్రికెట్ అభిమానులు ఫైర్ అవుతున్నారు.సాధారణంగా ప్రపంచ కప్ లాంటి మెగా టోర్నీలు ప్రారంభానికి ముందు ఆరంభ వేడుకలు నిర్వహిస్తుంటారు.

 Cricket Fans Fire On Bcci World Cup Started Without Opening Ceremony , Odi World-TeluguStop.com

ఈ ప్రారంభ వేడుకలలో పలువురు ప్రముఖ తారలు డాన్స్, పాటలు లాంటి కార్యక్రమాలతో మైదానంలో ఉండే అభిమానులను అలరిస్తారు.మన భారత దేశంలో ప్రతి సంవత్సరం జరిగే ఐపీఎల్ కు ముందు బీసీసీఐ ఆరంభ వేడుకలను( BCCI opening ceremony) ఎంత ఘనంగా నిర్వహిస్తుందో మనందరికీ తెలిసిందే.

అలాంటిది భారత్ వేదికగా జరిగే వన్డే వరల్డ్ కప్ టోర్నీ ఇంకా ఎంత ఘనంగా నిర్వహిస్తుందో అని క్రికెట్ అభిమానులు భావించారు.కానీ చివరకు క్రికెట్ అభిమానులకు బీసీసీఐ నిరాశనే మిగిలించింది.

Telugu Ahmedabad, Bcci Ceremony, Bcci Cup, Narendra Modi, Odi Cup-Sports News �

ఓ జాతీయ మీడియా తన కథనంలో తెలిపిన వివరాల ప్రకారం. ఐపీఎల్ మ్యాచ్లు సాయంత్రం ప్రారంభం అవుతాయి కాబట్టి మధ్యాహ్నం ప్రారంభ వేడుకలు నిర్వహించేందుకు కావలసినంత సమయం ఉంటుంది.కానీ ప్రపంచ కప్ మ్యాచ్లు మధ్యాహ్నం ప్రారంభం అవుతాయి.కాబట్టి ప్రారంభ వేడుకలు నిర్వహించేందుకు తగిన సమయం ఉండదని పేర్కొంది.ఒకవేళ బీసీసీఐ ప్రారంభ వేడుకలను ఘనంగా నిర్వహించాలి అనుకుంటే బుధవారమే నిర్వహించి ఉండాలి.కానీ బీసీసీఐ వన్డే వరల్డ్ కప్ ప్రారంభ వేడుకలపై ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఇక బీసీసీఐ ప్రారంభ వేడుకలను నిర్వహించకపోయినప్పటికీ టోర్నీ ప్రారంభానికి ఒక రోజు ముందు కెప్టెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించింది.ఈ కార్యక్రమంలో అన్ని జట్ల కెప్టెన్లు పాల్గొని వన్డే వరల్డ్ కప్ ట్రోఫీతో కలిసి ఫోటో సెషన్లో పాల్గొనడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube