టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో వాదనలు ప్రారంభం అయ్యాయి.ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ పిటిషన్ నిన్న విచారణ చేపట్టగా కోర్టు సమయం పూర్తి కావడంతో ఇవాళ్టికి వాయిదా పడింది.ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ పిటిషన్ పై న్యాయస్థానంలో ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.
కాగా ఫైబర్ గ్రిడ్ కేసులో చంద్రబాబును పోలీసులు ఏ25గా పేర్కొన్నారు.
మరోవైపు చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విజయవాడలోని ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది.
ఈ క్రమంలో ఇప్పటికే ఇరువర్గాల న్యాయవాదులు కోర్టుకు చేరుకున్నారు.చంద్రబాబు తరపున లాయర్ ప్రమోద్ కుమార్ దూబే, సీఐడీ తరపున ఏఏజీజ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించనున్నారు.
కాగా కాల్ వర్క్ అనంతరం వాదనలు వింటామని న్యాయమూర్తి తెలిపారు.అయితే ఇవాళ్టితో చంద్రబాబు రిమాండ్ ముగియనున్న సంగతి తెలిసిందే.







