దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు త్వరలోనే నగారా మోగనుంది.ఇందులో భాగంగా ఈ నెల 12 లేదా 13వ తేదీన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది.
ఈ మేరకు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మిజోరాంతో పాటు తెలంగాణ రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి.ఇప్పటికే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మిజోరాంలో కేంద్ర ఎన్నికల బృందం పర్యటన ముగిసింది.
ఈ క్రమంలోనే ఎన్నికల బృందం తెలంగాణ పర్యటన ఇవాళ్టితో ముగియనుంది.కాగా ఈ నాలుగు రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ తరువాతే తెలంగాణలో పోలింగ్ జరగనుంది.
ఈ క్రమంలో నవంబర్ ఆఖరి వారం లేదా డిసెంబర్ మొదటి వారంలో తెలంగాణలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది.







