దెందులూరు మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నేత చింతమనేని ప్రభాకర్( Chintamaneni Prabhakar ) కి భీమవరం కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడం జరిగింది.సెప్టెంబర్ నెలలో భీమవరంలో లోకేష్( Lokesh ) యువగళం పాదయాత్రలో టీడీపీ వర్సెస్ వైసీపీ కార్యకర్తల మధ్య భారీగా ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.
ఇదే సమయంలో కొంతమంది పోలీసులకు కూడా గాయాలయ్యాయి.ఆ సమయంలో యువగళం పాదయాత్రకి సంబంధించి పనిచేసే వాలంటీర్లు ఇంకా వంట సిబ్బంది సహా సుమారు 50 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ క్రమంలో పాదయాత్ర అల్లర్లకు సంబంధించి పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ ( Telugu Desam Party )నాయకులతో పాటు చింతమనేని ప్రభాకర్ పై పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు.దీంతో కోర్టును ఆశ్రయించడంతో.
చింతమనేని ప్రభాకర్ కి ముందస్తు బెయిల్ మంజూరు చేయడం జరిగింది.భీమవరం అల్లర్ల కేసు తర్వాత చింతమనేని చాలా వరకు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు.
అందువల్లే చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో దెందులూరులో టీడీపీ పార్టీ నిర్వహించిన నిరసన కార్యక్రమాలలో మొన్నటి వరకు ఎక్కడా కనబడలేదు.అయితే తాజాగా న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయటంతో.
రాజకీయంగా మళ్ళీ ఇప్పుడు నియోజకవర్గంలో చింతమనేని యాక్టివ్ అవుతున్నారు.







