జనసేన అధినేత పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) నిర్వహిస్తున్న వారధి విజయ యాత్ర నాలుగో విడత ప్రస్తుతం పెడన నియోజకవర్గం లో( Pedana ) సాగుతుంది.యాత్రలో భాగంగా నేడు పెడన టౌన్ తోటమాల సెంటర్ లో బహిరంగ సభ నిర్వహించారు.
ఈ బహిరంగ సభకు భారీ ఎత్తున జనసేన కార్యకర్తలు తరలివచ్చారు.ఇదే సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా భారీగా మోహరించారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వం పై సీఎం జగన్ పై( CM Jagan ) సీరియస్ వ్యాఖ్యలు చేశారు.జన సైనికులపై వైసీపీ దాడులు చేస్తుందని మండిపడ్డారు.
ఏపీకి రావాలంటే వీసా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అని అన్నారు.
క్లాస్ వార్ అని మాట్లాడే జగన్ జాతీయ పథకం కింద.ఉపాధి కూలీలకు వచ్చే నిధులను పక్కదారి మళ్లించి వాళ్ళ కడుపు కొట్టారు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.నిధులు మళ్లింపు మరియు నిధులు దోచేయటంలో జగన్ ప్రభుత్వం ఆరితేరిందని వ్యాఖ్యానించారు.
ఇది రూపాయి పావలా ప్రభుత్వం అని వ్యంగ్యంగా విమర్శించారు.జగన్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందని విమర్శించారు.
నిజంగా యువతకు ఉద్యోగాలు కల్పిస్తే మెగా డీఎస్సీ కోసం నిరుద్యోగులు అవనిగడ్డ సభకు ఎందుకంత భారీగా తరలి వచ్చారని వైసీపీ ప్రభుత్వాన్ని పవన్ నిలదీశారు.యువతకు ఉద్యోగాలు కల్పించకపోవడం వల్లే జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారని పెడన సభలో పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.