చిరంజీవి సోదరుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నాగబాబు( Nagababu ) నటుడిగా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు.అలాగే నిర్మాతగా కూడా ఆయన చేతులు కాల్చుకున్నాడు.
ఇప్పటి వరకు ఆయన తీసిన సినిమాల్లో ఎక్కువ శాతం డిజాస్టర్ ఫ్లాప్స్ గా మిగిలినవే ఉన్నాయి.ఇది నిజంగా ఆయన దురదృష్టం అనే చెప్పాలి.
బాగున్న సినిమాలు కూడా నాగబాబు కి నష్టాలు తెచ్చాయంటే, ఆయన గ్రహాల మూవ్మెంట్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.ఇప్పటి వరకు ఆయన నిర్మించిన సినిమాలలో ‘బావగారు బాగున్నారా’ చిత్రం బాగా ఆడింది.
ఆ తర్వాత స్టాలిన్( Stalin Movie ) చిత్రం పర్వాలేదు అనిపించింది.మిగిలిన సినిమాలన్నీ నష్టాలను తెచ్చిపెట్టినవే.
ముఖ్యంగా మూడవ తరం స్టార్ హీరోలైన రామ్ చరణ్ కి ‘ఆరెంజ్’ మరియు అల్లు అర్జున్ కి ‘నా పేరు సూర్య’ వంటి డిజాస్టర్ ఫ్లాప్ సినిమాలను అందించాడు.అలాగే పవన్ కళ్యాణ్ తో తీసిన ‘గుడుంబా శంకర్’ చిత్రం కూడా ఫ్లాప్ అయ్యింది.

అయితే ఇప్పటి వరకు నాగబాబు కేవలం మెగా ఫ్యామిలీ హీరోలతోనే సినిమాలు చేస్తూ వచ్చాడు.కానీ అప్పట్లో ఆయన విక్టరీ వెంకటేష్ తో( Venkatesh ) కూడా ఒక సినిమా చెయ్యాలని చూసాడు అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. కె బాలచందర్ దర్శకత్వం లో మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన చిత్రం ‘రుద్రవీణ’.( Rudraveena ) ఈ సినిమా మెగాస్టార్ కెరీర్ లో ఎంతో ప్రత్యేకమైనది.
కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ సాధించలేదు కానీ, చిరంజీవి కి బోలెడంత పేరు ప్రఖ్యాతలు తెచ్చి పెట్టింది ఈ సినిమా.ఈ సినిమాకి నాగబాబు నిర్మాతగా వ్యవహరించాడు.
ఉత్తమ ప్రాంతీయ బాషా చిత్రం గా అప్పట్లో ఈ సినిమాకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది.అయితే ఈ చిత్రాన్ని తొలుత విక్టరీ వెంకటేష్ తో చెయ్యాలని అనుకున్నాడట నాగబాబు.
ఇలాంటి కథలు ఆయన చేస్తేనే జనాలు చూస్తారని నాగబాబు బలంగా నమ్మాడు.

ఇదే విషయాన్నీ చిరంజీవి కి చెప్పగా, ఈ కథ నాకు ఎంతో నచ్చింది, ఈ సినిమా నేనే చేస్తాను, నువ్వు వెంకటేష్ తో కావాలంటే వేరే సినిమా చెయ్యి అని అన్నాడట.చిరంజీవి అప్పటికే పెద్ద మాస్ హీరో, అలాంటి ఇమేజి ఉన్న మెగాస్టార్ ఇంత సాఫ్ట్ సినిమా తీస్తే అభిమానులు మరియు ప్రేక్షకులు తీసుకోగలరా?, ఎందుకు అన్నయ్య రిస్క్ అని చిరంజీవి తో అన్నాడట నాగబాబు.బాలచందర్ గారి దర్శకత్వం లో హీరో గా చెయ్యాలనేది నా కోరిక రా, ఈ సినిమా హిట్టైన ప్లాపైనా నా జీవితం లో ఒక గొప్ప సినిమా చేశాను అనే అనుభూతిని ఇస్తుంది.
ఆ అనుభూతి ముందు డబ్బులు ఎంత, నీకు ఈ సినిమా వల్ల పొరపాటున నష్టం వస్తే, ఆ నష్టాన్ని నేను భరిస్తాను, ఈ సినిమా నేనే చేస్తాను అని చెప్పాడట.అలా వెంకటేష్ చెయ్యాల్సిన రుద్రవీణ చిత్రం చిరంజీవి చేసాడు.







