తెలంగాణలోని బీఆర్ఎస్ నేతలపై బీజేపీ నాయకురాలు డీకే అరుణ తీవ్రంగా మండిపడ్డారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు.
కేసీఆర్ కుటుంబానికి లక్షల కోట్లు ఎలా వచ్చాయని డీకే అరుణ ప్రశ్నించారు.అనంతరం రేవంత్ రెడ్డిపై ఆమె ధ్వజమెత్తారు.
లోపాయికారి ఒప్పందంలో భాగంగానే ఓటుకు నోటు కేసులో తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కేసీఆర్ కాపాడుతున్నారన్నారు.కాంగ్రెస్, బీఆర్ఎస్ దే ఫెవికాల్ బంధమని చెప్పారు.
మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని డీకే అరుణ స్పష్టం చేశారు.







