చిరంజీవి సినిమా కోసం ఆ సీనియర్ హీరోయిన్ తో సంప్రదింపులు?

మెగాస్టార్‌ చిరంజీవి భోళా శంకర్( Bhola Shankar ) సినిమా తీవ్రంగా నిరాశ పరిచింది.అందుకే బ్రో డాడీ రీమేక్ చేయాలని భావించి కూడా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు.

 Chiranjeevi Going To Romance With Shriya Sharan For His Next Film , Bhola Shanka-TeluguStop.com

బింబిసార దర్శకుడు వశిష్ఠ్‌ దర్శకత్వం లో ఒక సినిమా ను చేయబోతున్న విషయం తెల్సిందే.ఇప్పటికే సినిమా షూటింగ్‌ ప్రారంభం అవ్వాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది.

వచ్చే నెలలో రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.ఇక ఈ సినిమా కోసం హీరోయిన్‌ విషయం లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

ముఖ్యంగా ఈ సినిమా కోసం శ్రియ శరణ్‌ ( Shriya Saran )ను సంప్రదించారు అంటూ వార్తలు వస్తున్నాయి.ఈ మధ్య కాలంలో శ్రియ నటించిన సినిమా లు పెద్దగా ఆడటం లేదు.

పైగా ఆమె వయసు నాలుగు పదులు దాటడం వల్ల సినిమా ఆఫర్లు తగ్గాయి.దాంతో ఆమెను చిరంజీవికి జోడీగా నటింపజేయడం ఏమాత్రం కరెక్ట్‌ కాదు అన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.చిరంజీవి తో గతం లో శ్రియ నటించిన విషయం తెల్సిందే.కానీ ఇప్పుడు ఆమె తో చిరంజీవి నటించడం ను కొందరు ఒప్పుకోవడం లేదు.

యంగ్‌ హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు కనుక చిరంజీవి వారిలో ఒకరిని ఎంపిక చేసుకుంటే బాగుంటుంది అంటూ కొందరు సూచిస్తూ ఉంటే కొందరు మాత్రం త్రిష లేదా శ్రియ లు చిరంజీవి కి జోడీగా నప్పుతారు.కనుక వారిలో ఒకరిని తన సినిమా లోకి తీసుకోవడం మంచి నిర్ణయమే అన్నట్లుగా కొందరు సూచిస్తున్నారు.మరి చిరంజీవి కోసం దర్శకుడు వశిష్ఠ్‌ ( Mallidi Vasishta )ఏ హీరోయిన్‌ ని రంగం లోకి దించుతాడు అనేది ఈ నెల చివరి వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.చిరంజీవి నిర్ణయం పై హీరోయిన్‌ ఎంపిక ఆధారపడి ఉంటుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube