అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ కెవిన్ మెక్‌కార్థీ( Kevin McCarthy ) తన పదవిని కోల్పోయారు.ఆయనకు వ్యతిరేకంగా రిపబ్లికన్లు ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదం లభించడంతో స్పీకర్ పదవిని వీడక తప్పలేదు.
అయితే ఇలా ఓ స్పీకర్‌ను అవిశ్వాస తీర్మానం ద్వారా బలవంతంతగా తప్పించడం అమెరికా చరిత్రలోనే తొలిసారి.పదవిని చేపట్టిన 10 నెలల్లోనే మెక్‌కార్థీ ఉద్వాసనకు గురవ్వడం గమనార్హం.
నిజానికి ఆయన స్పీకర్ పదవిని చేపట్టిన నాటి నుంచి పలుమార్లు వ్యతిరేకతను ఎదుర్కోన్నారు.ఇచ్చిన హామీలను సైతం నిలబెట్టుకోలేదన్న ఆరోపణలను సైతం మెక్ కార్ధీ ఎదుర్కోన్నారు.
ఇక గత వారం అమెరికాలో( America ) నెలకొన్న ‘‘షట్‌డౌన్’’( Shutdown ) కూడా స్పీకర్‌కు లేనిపోని తలనొప్పులు తెచ్చిపెట్టింది.
బైడెన్ సారథ్యంలోని ఫెడరల్ ప్రభుత్వం( federal government ) షట్‌డౌన్ కాకుండా కాపాడేందుకు మెక్‌కార్ధీ ప్రత్యేకమైన చొరవ తీసుకున్నారు.45 రోజుల పాటు నిధుల విడుదలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రవేశపెట్టిన బిల్లులను రిపబ్లికన్లు తీవ్రంగా వ్యతిరేకించారు.ఇక బిల్లు పాసవ్వడం అసాధ్యం అనుకున్న దశలో మెక్‌కార్ధీ రంగంలోకి దిగారు.
దేశ ప్రజలకు కలిగే ఇబ్బందులను దృష్టిలో వుంచుకుని బిల్లులకు ఆమోదం తెలపాలని ఆయన రిపబ్లికన్ సభ్యులను( Republican members ) కోరారు.స్పీకర్ స్వయంగా అభ్యర్ధించడంతో రిపబ్లికన్లు వెనక్కి తగ్గి బిల్లులకు ఆమోదం తెలిపారు.

అయితే ఈ పరిణామాలపై రిపబ్లికన్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.అంతేకాదు.స్పీకర్ పదవిని కాపాడుకునేందుకు మెక్‌కార్ధీ డెమొక్రాట్లతో కుమ్మక్కయ్యారన్న ఆరోపణలు వినిపించాయి.ఈ క్రమంలో స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని నిర్ణయించుకున్నారు.దీనిలో భాగంగానే స్పీకర్ ఎన్నికల్లో మెక్‌కార్ధీతో తలపడిన రిపబ్లికన్ నేత మ్యాట్ గేజ్( Republican leader Matt Gage ) అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా.216-220 ఓట్ల తేడా తీర్మానం నెగ్గింది.దీంతో ఆయనను పదవి నుంచి తొలగించి.స్పీకర్ పదవి ఖాళీ అయినట్లుగా ప్రకటించారు.మరో స్పీకర్ బాధ్యతలు చేపట్టే వరకు రిపబ్లికన్ నేత పాట్రిక్ హెన్రీకి తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు.

కాగా.గతేడాది నవంబర్ 8న జరిగిన మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ సభలో మెజారిటీ కోల్పోయింది.ఈ క్రమంలో నాన్సీ పెలోసీ స్థానంలో మెక్‌కార్దీ యూఎస్ ప్రతినిధుల సభ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టారు.
అమెరికాలోని ప్రోటోకాల్ ప్రకారం.దేశాధ్యక్షుడు, ఉపాధ్యక్షుడి తర్వాతి హోదాలో స్పీకర్ నిలుస్తారు.
హౌస్ ఎజెండా, లెజిస్లేటివ్ బిజినెస్ మొత్తం స్పీకర్ నియంత్రణలో వుంటుంది.అందువల్లే అమెరికా రాజకీయాల్లో ప్రతినిధుల స్పీకర్‌కు తిరుగులేని ప్రాధాన్యత వుంటుంది.







