సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులు వాళ్లకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకోవడానికి చాలా సినిమాల్లో నటిస్తు వాళ్ళకి మంచి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకుంటారు.అయితే హీరోలు పౌరాణిక సినిమాల్లో నటిస్తున్నప్పుడు దేవుడి క్యారెక్టర్లు చేసేటప్పుడు వాళ్ళ మీద ఉండే కొన్ని వస్తువులు గాని, కొన్ని రకాల జీవులు గాని వాళ్ల మీద ఉండాల్సి వస్తుంది.
అందులో భాగంగానే శివుడి గెటప్ వేసుకున్నప్పుడు పక్కాగా వాళ్ల బాడీ మీద పులి చర్మం ఉండాలి,మీద లో పాము ( Snake ) కూడా ఉండాల్సి ఉంటుంది.అలాంటప్పుడు ఒరిజినల్ పాములు మెడ లో పెట్టుకుంటే సీన్ చేసేటప్పుడు గాని అది కరెక్ట్ గా కోరాలని బయటకి కోరకపోతే ఆ సీన్ సరిగ్గా పండదు, మెడ లో పాము కదులుతూ ఉంటే ఆ ఆర్టిస్ట్ సరిగ్గా నటించడు.
కాబట్టి అలాంటి సీన్ చేసేటప్పుడు ఒరిజినల్ పాము ని మెడలో వేసుకుంటే చేసే సీన్ కి డిస్టబెన్స్ వస్తుంది.

అలాగే నటులకి కూడా ఇబ్బందిగా ఉంటుంది.కాబట్టి అలాంటి పాత్ర కోసం మామూలుగా అల్యూమినియంతో చేసిన పాములను ధరించడం జరుగుతుంది లేదా సెట్ వాళ్లు ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఒక పాము లాంటి ఆకారంలో ఉన్న దాన్ని ధరించడం జరుగుతుంది.ఇక పెద్ద ఎన్టీఆర్( Sr NTR ) దగ్గరనుంచి మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) వరకు కూడా ప్రతి ఒక్కరు శివుడి గెటప్ వేసినపుడు అల్యూమినియం పాములను ధరించి షూటింగ్ చేసినవారే అయితే రియలేస్టిక్ గా ఉండడానికి బ్రహ్మచారి సినిమాలో( Brahmachari Movie ) కమల్ హాసన్ ఒక సీక్వెన్స్ లో శివుడి గెటప్ లో నటించాల్సి ఉంటుంది.

దాంట్లో భాగంగా ఆయన మెడలో ఒరిజినల్ పామును వేసుకొని నటించాడు లక్కీగా అది ఆ టైంకి నాలుకతో కోరలు కోరడంతో కరెక్ట్ గా యాక్షన్ ఇవ్వడంతో ఆ సీన్ చాలా రియలేస్టిక్ గా వచ్చింది.ఇక దాంతో ఒరిజినల్ పామును వేసుకొని కూడా షూటింగ్ చేయొచ్చు అని చాలామంది దర్శక నిర్మాతలు హీరోలు సైతం ఆ సీన్ చూసిన తర్వాత రియలైజ్ అయ్యారు.అందుకే కమల్ హాసన్ ని( Kamal Haasan ) లోకనాయకుడు అని పిలిచేది.అసాధ్యమైన ప్రతిదాన్ని ఆయనే సాధ్యం చేసి చూపిస్తాడు…
.







