తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భాగస్వామిగా ఉన్న కేసీఆర్ కు ఎంఐఎం ఇంకా మద్దతు కొనసాగిస్తుందా అనేది చెప్పాలని డిమాండ్ చేశారు.
బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటైనప్పుడు ఎంఐఎం కేసీఆర్ తో పొత్తు ఎలా కొనసాగిస్తుందని రేవంత్ రెడ్డి నిలదీశారు.మోదీ, కేసీఆర్ బంధం పెవికాల్ బంధం అన్నారు.
గల్లీలో కొట్లాటలు నటించి ఢిల్లీలో దోస్తీ చేస్తున్నారని ఆరోపించారు.తెలంగాణ సమాజానికి ఎంఐఎం సమాధానం చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
మోదీ వ్యాఖ్యల నేపథ్యంలో ఎంఐఎం విధానం ఎంటో ఆ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ సమాధానం చెప్పాలని వెల్లడించారు.కాంగ్రెస్ ప్రజల పక్షాన మాత్రమే నిలబడుతుందన్నారు.
ఈ క్రమంలోనే ఆరు గ్యారెంటీలతో ముందుకు వెళ్తున్నామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.







