టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి సురేఖ వాణి ( Surekha Vani ) ఒకరు.ఒకప్పుడు ఈమె ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలలో నటించి మెప్పించారు.
ఎక్కువగా అక్క పిన్ని వదిన పాత్రలలో నటించే సురేఖ వాణి ఈ మధ్యకాలంలో సినిమాలను కాస్త తగ్గించాలని చెప్పాలి.ఈమెకు సినిమా అవకాశాలు రాక ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారో లేక సోషల్ మీడియా పై ఆసక్తి పెరగడంతో సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు తెలియదు కానీ సినిమాలను మాత్రం పూర్తిగా తగ్గించేశారు.
ఇక 2019వ సంవత్సరంలో సురేఖవాణి భర్త సురేష్ తేజ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించారు.అప్పటినుంచి తన కుమార్తెతో కలిసి ఒంటరిగా ఉన్నటువంటి ఈమె కరోనా సమయంలో సోషల్ మీడియాలోకి అడుగు పెట్టారు.ఇలా సోషల్ మీడియా వేదికగా తన కుమార్తె సుప్రీత( Supritha )ను పరిచయం చేశారు.ఇలా సుప్రీత సురేఖ వాణి ఇద్దరు కలిసి పొట్టి దుస్తులు ధరిస్తూ పెద్ద ఎత్తున పార్టీలు వెకేషన్స్ అంటూ తెగ ఎంజాయ్ చేయడమే కాకుండా అందుకు సంబంధించిన వీడియోలను ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటూ పెద్ద ఎత్తున అభిమానులను సొంతం చేసుకున్నారు.
వీరికి ఏ మాత్రం సమయం దొరికిన వెంటనే వెకేషన్ లకు వెళ్లడం చేస్తుంటారు.ఇలా తాజాగా సుప్రీత వెకేషన్ లో ఉన్నారని తెలుస్తుంది.ఈ క్రమంలోనే ఒక బీచ్ లో ఈమె సముద్రపు అందాలను ఆస్వాదిస్తూ తెగ ఎంజాయ్ చేశారు.ఇలా సాగర తీరాన ఉవ్వెత్తున ఎగిసి పడుతున్న అలల మాదిరిగా తన ఎద అందాలను కూడా ఆరబోస్తూ ఈమె షేర్ చేసినటువంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో( Social media ) వైరల్ గా మారింది.
ఇక ఈ వీడియో చూసిన అభిమానులు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు.ఇలా తరచూ గ్లామరస్ వీడియోలను ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసే ఈమెకు హీరోయిన్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి.
పొట్టి పొట్టి దుస్తులు ధరించి ఈ తల్లి కూతుర్లు ఇద్దరు చేసే హడావుడి మామూలుగా లేదు.అయితే కొన్నిసార్లు ఈ కారణం చేత వీరిద్దరూ భారీ స్థాయిలో ట్రోల్స్ ఎదుర్కొన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి.ఇలా చాలామంది వీరిపై ఎన్నో రకాల ట్రోల్స్ చేసినప్పటికీ వాటి గురించి ఏమాత్రం పట్టించుకోకుండా తమ స్టైల్ లో వారు ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఇలా సుప్రీత సోషల్ మీడియాలో ఈ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకోవడంతో ఈమెకు ఏకంగా బిగ్ బాస్( Bigg Boss )లో పాల్గొనే అవకాశం వచ్చింది అంటూ వార్తలు వస్తున్నాయి.
తెలుగు సీజన్ సెవెన్ ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే.ఈ కార్యక్రమానికి ఈమె వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇవ్వబోతుంది అంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నప్పటికీ ఈ వార్తలపై సుప్రీత( Supritha ) ఏ విధమైనటువంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు.